ఇంటర్‌ కాలేజీలకు షాక్‌ .. నాణ్యమైన విద్యే లక్ష్యం.. జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలన్నదే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైసీపీ సర్కార్‌ విద్యా వ్యవస్థను ఇప్పటికే ప్రక్షాళన చేయడం ప్రారంభించింది. ప్రభుత్వం ఏర్పడి మొదటి ఏడాది నుంచే విద్యా వ్యవస్థలో సమూలాగ్రం శుద్ధి చేసే పని చేపట్టింది. ఇందులో భాగంగా వైసీపీ సర్కార్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు, కార్పొరేట్‌ కాళాశాల్లో అడ్మిషన్లపై పరిమితి విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒక సెక్షన్‌లో గరీష్టంగా 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి. ఒక కాలేజీలో కనిష్టంగా 4 సెక్షన్లు, గరీష్టంగా 9 సెక్షన్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి.

విద్యార్థుల పాఠశాల విద్య తర్వాత అంత్యంత ముఖ్యమైనది ఇంటర్‌ విద్య. ఇక్కడ విద్యార్థులు ఏ గ్రూపు తీసుకుంటారో, అందులో ఏ స్థాయి విజ్ఞానం సంపాదిస్తారన్న దానిపై వారి భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. ఇంటర్‌లో ఎంపీసీ గ్రూపు తీసుకున్న వారు ఇంజనీరింగ్, బైపీసీ తీసుకున్న వారు వైద్య విద్య, ఫార్మసీ తదితర వృత్తి విద్య కోర్సుల వైపు వెళతారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఇంటర్‌ విద్య కార్పొరేటర్‌ కాలేజీల ధనదాహానికి చిత్తయిపోతోంది. కనీసం సౌకర్యాలు, అత్యవసరమైన ల్యాబులు లేకుండానే రాష్ట్రంలో పలు కార్పొరేట్‌ కాలేజీ విరివిగా బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి పరిమితికి మించి అడ్మిషన్లు ఇస్తోంది.

సాధారణంగా ఆయా కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు మాత్రమే అత్యధిక భాగం ఉంటాయి. ఆర్ట్స్‌ గ్రూపులైన సీఈసీ, హెచ్‌ఈసీ చదవాలంటే చిన్నా చితకా ప్రైవేటు కాలేజీలు, లేదా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలే శరణ్యం. కార్పొరేటర్‌ కాలేజీలు వివిధ పేర్లతో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో వందల, వేల సంఖ్యలో ఒక కాలేజీలోనే అడ్మిషన్లు ఇస్తున్నాయి. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయి. మంది ఎక్కువైతే మజ్జిక పలుచన అవుతందన్న చందంగా ఆయా కార్పొరేటర్‌ కాలేజీ బ్రాంచ్‌లలో నాణ్యమైన విద్య పెద్ద మిథ్యగా మారింది. ఈ నేపథ్యంలోనే జగన్‌ సర్కార్‌ తాజా సంస్కరణలను ప్రవేశపెట్టిందని చెప్పవచ్చు.

అమ్మ ఒడి పథకంలో ఒకటి నుంచి ఇంటర్‌ వరకూ చదివే విద్యార్థులకు వారి తల్లుల ఖాతాలో ఏడాదికి 15 వేల రూపాయలు, ఇంటర్‌ తర్వాత చదివే వృత్తి విద్యా, ఇతర కోర్సులకు ప్రభుత్వం పూర్తిగా ఫీజు రియంబర్స్‌మెంట్‌ చేస్తూనే. మెస్‌ ఖర్చులకు ఏడాదికి 20 వేల రూపాయలు ఇస్తోంది. తదఫలితంగా ఏపీలో ఒకటి నుంచి పీజీ వరకూ ఉచిత విద్య రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబంలోని పిల్లలకు అందుతోంది. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా జగన్‌ సర్కార్‌ పథకాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందిస్తూ నవశకానికి నాంధి పలికింది.

Show comments