Vinay Kola
Abdullahpurmet: అబ్దుల్లాపూర్‌మెట్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతులకు మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపుతుంది. ఈ ఘటనలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులపై దాడికి దిగారు.
Abdullahpurmet: అబ్దుల్లాపూర్‌మెట్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతులకు మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపుతుంది. ఈ ఘటనలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులపై దాడికి దిగారు.
Vinay Kola
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతులకు మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపుతుంది. ఈ ఘటనలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు విధ్యంసం సృష్టించారు. ఏకంగా రైతులపై దాడికి దిగారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రస్తుతం భూ వివాదం జరుగుతుంది. ఆ వివాదానికి సంబంధించి గ్రామస్థులు ఎదురు తిరిగారు. దాంతో వారిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాడులకు పాల్పడ్డారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం.. అబ్దుల్లాపూర్ మెట్ పిగ్లిపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 17పై నెలకొన్న వివాదం గురించి మాట్లాడుదామని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్రామస్థులతో చర్చలు జరిపేందుకు వారిని పిలిచారు. ఈ క్రమంలో రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య గొడవ జరిగింది..
రియల్ ఎస్టేట్ వ్యాపారులు రౌడీలతో తమను కొట్టించారని గ్రామస్థులు ఆరోపించారు. గతంలో ధరణి పోర్టల్‌లో రికార్డులు తారుమారు చేసి వందల కోట్ల విలువైన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారని ఆరోపించారు. ఇప్పుడు మాట్లాడుకుందామని పిలిచి తమపై అన్యాయంగా దాడి చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీలింగ్ ల్యాండ్‌ను పట్టాగా రికార్డ్‌లలో చూపించి మా భూములు లాక్కున్నారని ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోపాల్ యాదవ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి న్యాయం అడిగిన రైతులపై దాడి చేశారని వాపోయారు. అంతేగాక అతను మళ్ళీ ఈ ప్రాంతానికి రైతులు వస్తే చంపేస్తామని బెదిరించాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల చుట్టూ గత 6 నెలల నుండి తిరిగినా కూడా తమకి న్యాయం జరగడం లేదని రైతులు వాపోయారు. ఈ విషయంలో మాకు ఎలాగైనా న్యాయం జరగాలని రైతులు డిమాండ్ చేశారు. మాట్లాడుకుందామని పిలిచి మాపై ఇంత దారుణంగా కర్రలు, రాడ్లతో దాడులు చేయడం అన్యాయం అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులు తమపై దాడి చేసినందుకు భయపడలేదు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ గొడవ గురించి దర్యాప్తు చేస్తున్నారు. మరి అబ్దుల్లాపూర్‌మెట్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతులకు మధ్య జరిగిన ఈ ఘర్షణ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.