SNP
SNP
భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతమైన క్యాచ్ చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అందుకున్న ఓ సూపర్ క్యాచ్ ఈ మ్యాచ్‌కే కాదు మొత్తం వరల్డ్ కప్ టోర్నీకే హైలెట్‌గా మారే అవకాశం ఉంది. అందుకే ఈ క్యాచ్‌ను ఇప్పటికే కొంతమంది క్యాచ్ ఆఫ్ ది వరల్డ్ కప్ అంటున్నారు. అయితే.. ఈ సూపర్ క్యాచ్ ఇన్నింగ్స్ 43వ ఓవర్‌లో చోటు చేసుకుంది. బుమ్రా వేసిన ఓవర్‌లో మూడో బంతిని బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ సూపర్‌గా కట్ షాట్ ఆడాడు. బాల్ బుల్లెట్ వేగంతో.. బ్యాక్వర్డ్ పాయింట్ కుడివైపుగా వెళ్లింది.
అక్కడే కాచుకుని కూర్చున్న జడేజా.. తన కుడివైపుకు అద్భుతంగా చిరుతపులిలా డైవ్ చేస్తూ.. జింకను పులి పట్టుకున్నట్లు.. బాల్‌ను అందుకున్నాడు జడేజా. ఆ క్యాచ్ పట్టిన విధానం సూపర్ అనే చెప్పాలి. ఎన్ని సార్లు చూసినా.. మళ్లీ మళ్లీ చూడాలనేపించేలా ఉంది ఆ క్యాచ్. అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందా క్యాచ్. ఈ క్యాచ్ చూసిన వారు.. జడేజా మనిషేనా లేక చిరుతపులా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లోనే మరో సూపర్ క్యాచ్‌ను మరో టీమిండియా స్టార్ అందుకున్నాడు. మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో మోహదీ హసన్‌ను క్యాచ్‌ను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా అందుకున్నాడు. ఈ రెండు క్యాచ్‌లు అద్భుతంగా ఉన్నా.. జడేజా క్యాచ్‌కు కాస్త ఎక్కువ వెయిటేజ్ ఇవ్వచ్చని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఓపెనర్లు తాన్జిద్ హసన్(51), లిటన్ దాస్(66) హాఫ్ సెంచరీలతో రాణించి.. బంగ్లాదేశ్‌కు సూపర్ స్టార్ట్ అందించారు. తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించిన తర్వాత.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో హసన్ లెగ్ బిఫోర్‌గా అవుట్ అయ్యాడు. చివర్లో మహమ్మదుల్లా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 46 రన్స్ చేసి.. బంగ్లాకు ఓ మంచి స్కోర్ అందించాడు. కెప్టెన్ నజ్ముల్ షాంటో(8), మెహదీ హసన్(3), తౌహిద్(16) బ్యాటింగ్‌లో విఫలం అయ్యారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, జడేజా రెండేసి వికెట్లు తీసుకున్నారు. కుల్డీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్ చెరో వికెట్ తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో జడేజా అందుకున్న క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jadeja straight away wants that fielding medal and he hugged KL RAHUL straight away. Loves this bondpic.twitter.com/whW48Xm05y
— KL Siku Kumar (@KL_Siku_Kumar1) October 19, 2023
ఇదీ చదవండి: VIDEO: బంగ్లాతో మ్యాచ్‌లో ఇది గమనించారా? అదీ అశ్విన్ అంటే..!