iDreamPost
android-app
ios-app

VIDEO: బంగ్లాతో మ్యాచ్‌లో ఇది గమనించారా? అదీ అశ్విన్‌ అంటే..!

  • Published Oct 19, 2023 | 6:07 PM Updated Updated Oct 19, 2023 | 6:07 PM
  • Published Oct 19, 2023 | 6:07 PMUpdated Oct 19, 2023 | 6:07 PM
VIDEO: బంగ్లాతో మ్యాచ్‌లో ఇది గమనించారా? అదీ అశ్విన్‌ అంటే..!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టీమిండియా సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు విజయాలతో మంచి జోరు మీదున్న భారత్‌.. పూణెలో బంగ్లాదేశ్‌తో నాలుగో మ్యాచ్‌లో తలపడుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా బెంచ్‌ అంటే.. టీమ్‌లో ప్లేస్‌ లేని ఆటగాళ్లు మాత్రమే కాదని, థింక్‌ ట్యాంక్‌, ఎక్స్‌పీరియన్స్‌ ఆఫ్‌ టీమ్‌ అనేలా తెలిసొచ్చే దృశ్యాలు కనిపించాయి. ఇంతకీ ఏం జరిగిదంటే.. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. సూపర్‌ స్టార్ట్‌ అందుకుంది.

ఆ టీమ్‌ ఓపెనర్లు తాన్జిద్‌ హసన్‌, లిటన్‌ దాస్‌.. టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొవడమే కాదు ఆరంభంలో ఎదురుదాడికి కూడా దిగారు. దీంతో.. టీమిండియాకు పవర్‌ ప్లేలో వికెట్లు దక్కకపోగా.. పరుగులు భారీగా సమర్పించుకున్నారు. వరల్డ్‌ కప్స్‌ చరిత్రోనే బంగ్లాదేశ్‌కు అత్యధిక తొలి వికెట్‌ భాగస్వామ్యం కూడా ఈ మ్యాచ్‌లోనే లభించింది. 1999 వరల్డ్‌ కప్‌లో బంగ్లాదేశ్‌.. పాకిస్థాన్‌పై 69 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్య అందుకుంది. వన్డే వరల్డ్‌ కప్స్‌లో అదే ఇప్పటి వరకు అత్యధిక స్కోర్‌. కానీ, టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆ రికార్డును బంగ్లా ఓపెనర్లు బ్రేక్‌ చేశారు. తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించారు.

అయితే.. హసన్‌-దాస్‌ జోడీని విడదీసేందుకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పలు బౌలింగ్‌ మార్పులు చేశాడు. ఈ టోర్నీలో సూపర్‌ ఫామ్‌లో ఉన్న బుమ్రా సైతం వికెట్‌ తీయలేకపోయాడు. దీంతో టీమిండియా ఫస్ట్‌ బ్రేక్‌త్రూ కోసం చాలా సేపు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ తర్వాత.. డ్రింక్స్‌ బ్రేక్‌ కూడా వచ్చింది. ఈ డ్రింక్స్‌లో బ్రేక్‌లో టీమిండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌, స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఆటగాళ్ల కోసం డ్రింక్స్‌ తీసుకొచ్చాడు. అయితే.. డ్రింక్స్‌తో పాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కోసం ఓ అద్భుతమైన ఐడియాకు కూడా మోసుకొచ్చాడు. డ్రింక్స్‌ సమయంలో రోహిత్‌తో ఏదో చర్చలు జరిపాడు అశ్విన్‌.

అప్పటి వరకు వికెట్‌ కోసం ఎదురుచూస్తున్న రోహిత్‌.. చాలా శ్రద్ధగా అశ్విన్‌ చెప్పేది విన్నాడు. వినడమే కాకుండా.. దాన్ని నెక్ట్స్‌ ఓవర్‌లోనే ఇంప్లిమెంట్‌ చేశాడు. డ్రింక్స్‌ బ్రేక్స్‌ ముగియగానే.. కుల్దీప్‌ చేతికి బంతి ఇచ్చే ముందు రోహిత్‌ మాట్లాడాడు. ఆ ఓవర్‌ నాలుగో బంతికి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని అద్భుతంగా ఆడుతున్న ఓపెనర్‌ హసన్‌ ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ అయ్యాడు. అప్పటి వరకు పిచ్‌ను బయటి నుంచే గమనిస్తున్న అశ్విన్‌.. ఎలాంటి బంతులు వేయించాలో రోహిత్‌కు వివరించి ఉంటాడని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి తొలి వికెట్‌ కుల్దీప్‌ యాదవ్ తీసినప్పటికీ.. అందులో కొంత క్రెడిట్‌ అశ్విన్‌కు కూడా ఇవ్వాలని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అరుదైన దృశ్యం! 6 ఏళ్ల తర్వాత అలా చేసిన కోహ్లీ