iDreamPost
android-app
ios-app

‘ఎన్టీఆర్ 30’లో ఇద్దరు హీరోయిన్లు!

  • Published Dec 24, 2022 | 11:35 AM Updated Updated Dec 24, 2022 | 11:35 AM
  • Published Dec 24, 2022 | 11:35 AMUpdated Dec 24, 2022 | 11:35 AM
‘ఎన్టీఆర్ 30’లో ఇద్దరు హీరోయిన్లు!

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్న కొత్త చిత్రం ‘ఎన్టీఆర్ 30’ ఎప్పుడు మొదలవుతుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతి నెలా వచ్చే నెలే లాంచ్ అంటారు. అలా చాలా నెలలు గడిచిపోయాయి. ప్రస్తుతం జనవరిలో ప్రారంభం అంటున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై కూడా స్పష్టత లేదు. ఒక్కోసారి ఒక్కొక్కరి పేరు వినిపిస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రంలో ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.

జిమ్‌లో కష్టపడుతున్న జాన్వీ


‘ఎన్టీఆర్ 30’లో ఆలియా భట్ హీరోయిన్ గా నటించాల్సి ఉండగా.. పెళ్లి చేసుకోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. మరోవైపు కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కూడా ఆలస్యమవుతూ వచ్చింది. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ మూవీ టీమ్ ఇంతవరకు అఫిషియల్ గా ప్రకటించలేదు. ఇటీవల ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపించాయి. ఒకరు జాన్వీ కపూర్ కాగా, మరొకరు రష్మిక మందన్న. ముఖ్యంగా జాన్వీ పేరు బాగా వినిపించింది. ‘ఎన్టీఆర్ 30’లో హీరోయిన్ గా ఆమె ఖరారైందని, ఇక అనౌన్స్ చేయడమే ఆలస్యమని న్యూస్ వినిపించింది. అయితే ఇప్పుడు జాన్వితో పాటు రష్మిక పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇద్దరూ నటించబోతున్నట్లు వినికిడి.

‘ఎన్టీఆర్ 30’లో ఇద్దరు హీరోయిన్లు అని, రెండు పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉండటంతో.. జాన్వి, రష్మిక లను ఎంపిక చేశారని ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. శ్రీదేవి కూతురైన యంగ్ బ్యూటీ జాన్వీ ఇప్పటికే హిందీ సినిమాలు చేస్తూ.. సోషల్ మీడియా ద్వారా సౌత్ ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఇటీవల పలు సందర్భాల్లో ఎన్టీఆర్ తో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. మరోవైపు రష్మిక కూడా పుష్ప చిత్రంతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో ‘ఎన్టీఆర్ 30’ కూడా చేరనుందని అంటున్నారు. అదే నిజమైతే ఈ ఇద్దరికీ ఎన్టీఆర్ తో ఇదే మొదటి సినిమా కానుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbahsegel girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio