ఆంధ్రాకు లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లు.. ఇక పది నిమిషాల్లోనే రిజల్ట్స్

ఇప్పటి వరకూ రెండు నుండి మూడు రోజులు పడుతున్న కరోనా అనుమానితుల టెస్ట్ రిపోర్ట్స్ నేటి నుండి అత్యంత వేగంగా పది నిమిషాల్లో రిపోర్ట్స్ రానున్నాయి . ఇందుకోసం దక్షిణ కొరియా నుండి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ప్రత్యేక ఛార్టర్ ఫ్లయిట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించడం జరిగింది .

కాగా సీఎం వైఎస్ జగన్ ఈ రోజు తన క్యాంప్ కార్యాలయంలో ఈ టెస్ట్ కిట్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు . ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లను కమ్యూనిటీ టెస్టింగ్ కోసం ఉపయోగిస్తామని , 4 నుండి 5 రోజుల్లో అన్ని జిల్లాలకు చేరుస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంబంధిత అధికారులు తెలిపారు .

సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్ని , డిజిపి గౌతమ్ సవాంగ్ , డిప్యూటీ సీఎం ఆళ్ల నాని , మంత్రి బొత్స తదితరులు పాల్గొన్నారు .

కాగా ఇప్పటివరకూ టెస్ట్ రిపోర్ట్స్ ఆలస్యం కావటం వలన తలెత్తే ఇబ్బందులు తొలగిపోతాయని , అత్యంత వేగంగా టెస్ట్ రిపోర్ట్ తెలుసుకోవటం వలన అది వ్యాపించకుండా మరింత సమర్థంగా కరోనాని కట్టడి చేయడానికి అవకాశముంటుందని పలువురు వైద్యులు ఆరోగ్య శాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు .

Show comments