iDreamPost
android-app
ios-app

బ్రహ్మాస్త్ర చివరికి సాధించింది కానీ

  • Published Sep 29, 2022 | 3:22 PM Updated Updated Dec 06, 2023 | 11:12 AM

ది కాశ్మీర్ ఫైల్స్ సెట్ చేసిన బెంచ్ మార్క్ ని దాటేసి అన్ని భాషలకు కలిపి 255 కోట్లకు అతి దగ్గరగా వెళ్లిపోయింది.

ది కాశ్మీర్ ఫైల్స్ సెట్ చేసిన బెంచ్ మార్క్ ని దాటేసి అన్ని భాషలకు కలిపి 255 కోట్లకు అతి దగ్గరగా వెళ్లిపోయింది.

బ్రహ్మాస్త్ర చివరికి సాధించింది కానీ

భారీ అంచనాలతో విడుదలై టాక్ తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబట్టుకున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ ఎట్టకేలకు బాలీవుడ్ బిగ్గెస్ట్ గ్రాసర్ 2022 గా రికార్డు సాధించింది. ది కాశ్మీర్ ఫైల్స్ సెట్ చేసిన బెంచ్ మార్క్ ని దాటేసి అన్ని భాషలకు కలిపి 255 కోట్లకు అతి దగ్గరగా వెళ్లిపోయింది. ఒక్క హిందీ వెర్షన్ నుంచే 231 కోట్ల 50 లక్షలు రాగా తెలుగు తమిళ కన్నడ మలయాళం నుంచి 23 కోట్లు వచ్చాయి. త్రీడి, నార్మల్ అన్ని కలిపి ఇంత మొత్తం సాధించింది. రేపు విక్రమ్ వేదా విడుదలవుతున్న నేపథ్యంలో ఇకపై బ్రహ్మాస్త్రకు పెద్దగా కలెక్షన్లు ఉండకపోవచ్చు. మూడు వందల కోట్ల మార్కు కష్టమే. ఆర్ఆర్ఆర్ దాటాలన్న డ్రీం మాత్రం మిగిలిపోయింది

ముఖ్యంగా నేషనల్ సినిమా డే సందర్భంగా దేశవ్యాప్తంగా 75 రూపాయలకే మల్టీ ప్లెక్సుల్లో టికెట్లు అమ్మడం మూడో వారంలో బ్రహ్మాస్త్రకు చాలా కలిసి వచ్చింది. లేదంటే ఈ మార్కు సాధ్యమయ్యేది కాదు. కేవలం ఈ ఆఫర్ వల్లే ముప్పై కోట్లకు పైగా అదనంగా వచ్చి ఉంటుందని ట్రేడ్ అంచనా. యూనిట్ ఇంకా ప్రమోషన్లు చేస్తూనే ఉంది కానీ ఇంకా అద్భుతాలు ఆశించడం అత్యాశే. ఒకవేళ విక్రమ్ వేదాకు కనక టాక్ అటుఇటు వస్తే ప్లస్ అవ్వొచ్చు. కానీ మీడియాకు వేసిన స్పెషల్ ప్రీమియర్ల నుంచి చాలా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. పొన్నియన్ సెల్వన్ 1 కూడా హిట్ కొట్టిందంటే ఇక్కడితో బ్రహ్మాస్త్ర దుకాణం సర్దుకోక తప్పదు. రేపు తేలనుంది

ఇక బ్రహ్మాస్త్ర రెండో భాగం దేవ్ ని 2025 క్రిస్మస్ ని ప్లాన్ చేశామని దర్శకుడు అయాన్ ముఖేర్జీ ఓ మీటింగ్ లో తెచ్చి చెప్పాడు. సెకండ్ పార్ట్ కు కనీసం మూడేళ్ళ టైం పడుతుందని క్లారిటీ ఇచ్చాడు. మూడో భాగం 2026 అవుతుందట. సో సీక్వెల్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు తాత్కాలికంగా దాన్ని మర్చిపోవడం బెటర్. అయితే పార్ట్ 1 శివలో కంటెంట్ మీద వచ్చిన కామెంట్స్ దృష్టిలో ఉంచుకుని మిగిలిన రెండింటిని ఇంకా జాగ్రత్తగా తీయడం చాలా అవసరం. ఒకవేళ బ్రహ్మాస్త్రలో కనక అందరికీ నచ్చే ఎక్స్ ట్రాడినరీ ప్రెజెంటేషన్ ఉంటే ఖచ్చితంగా అయిదు వందల కోట్లు రాబట్టేది. అందుకే స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్