iDreamPost
android-app
ios-app

సాయిపల్లవి నట విశ్వరూపం.. విరాటపర్వం ట్రైలర్ రిలీజ్..

  • Published Jun 05, 2022 | 6:36 PM Updated Updated Jun 05, 2022 | 6:36 PM
  • Published Jun 05, 2022 | 6:36 PMUpdated Jun 05, 2022 | 6:36 PM
సాయిపల్లవి నట విశ్వరూపం.. విరాటపర్వం ట్రైలర్ రిలీజ్..

రానా, సాయిపల్లవి జంటగా, ప్రియమణి ముఖ్యపాత్రలో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. సుధాకర్ చెరుకూరి నిర్మించగా, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది. కరోనా ముందు రావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం జూన్ 17న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో రానా, ప్రియమణి నక్సలైట్ గా కనిపించబోతున్న సంగతి ముందు నుంచే తెలుసు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సాయి పల్లవి నట విశ్వరూపాన్ని చూసి షాక్ అయ్యారు.

ముందు నుంచే విరాటపర్వం స్టోరీ ఇదే అని ఓ కథ ప్రచారంలో ఉంది. తాజగా ట్రైలర్ రిలీజ్ అవ్వగా.. ఈ ట్రైలర్ లో కూడా రానా భావాలు, అతను రాసిన పుస్తకాలు నచ్చి సాయి పల్లవి అతన్ని ప్రేమించి, అతన్ని కలవడానికి ఇల్లు వదిలి వెళ్తుంది. నక్సలైట్ లతో సంబంధాలు ఉన్నాయని ఆమెని పోలీసులు చిత్ర హింసలు పెట్టినా మళ్ళీ రానా వద్దకే వెళ్లి తన ప్రేమని చెప్తుంది. తర్వాత సాయి పల్లవి కూడా నక్సలైట్ గా మారి రానాతో కలిసి యుద్ధం చేస్తుంది. ఇలా కథని దాదాపు ట్రైలర్ లోనే చూపించారు. ట్రైలర్ లో చెప్పిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. సినిమాలో కూడా ప్రేమ, యుద్దానికి సంబంధించిన డైలాగ్స్ చాలానే ఉంటాయని భావిస్తున్నారు ప్రేక్షకులు.

ఇక ట్రైలర్ లో ఎవ్వరూ ఊహించని విధంగా సాయిపల్లవి కోణంలో ఈ సినిమా చూపించబోతున్నట్టు అర్థమైంది. అలాగే నక్సలైట్స్ గా రానా, ప్రియమణి, నవీన్ చంద్ర కూడా తమ పర్ఫార్మెన్స్ లతో అదరగొట్టారు. ట్రైలర్ చూడటంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుకుంటున్నారు. ఇక ఈ సినిమా కోసం రానా అభిమానుల కంటే కూడా సాయి పల్లవి అభిమానులే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల రానా, డైరెక్టర్ వేణు ఈ సినిమాలో మెయిన్ లీడ్ సాయి పల్లవి, సాయి పల్లవి ఓ రేంజ్ లో నటించింది, సాయి పల్లవి చుట్టే కథ తిరుగుతుందని చెప్పారు. ట్రైలర్ చూస్తే అదే నిజం అనిపిస్తుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom