iDreamPost
android-app
ios-app

రమ్యకృష్ణ స్థానంలో మరో సీనియర్

  • Published Aug 02, 2021 | 11:02 AM Updated Updated Aug 02, 2021 | 11:02 AM
రమ్యకృష్ణ స్థానంలో మరో సీనియర్

తన కెరీర్ కొంత డల్ గా ఉన్నప్పుడు ఆక్సిజన్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా అంటే కింగ్ నాగార్జునకు ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదేళ్ళు దాటుతున్నా ఇంకా దాని సీక్వెల్ ని తీయాలనే పట్టుదలను కొనగిస్తూనే ఉన్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ ఎప్పుడో సిద్ధం చేసి పెట్టుకున్నప్పటికీ రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు దీనికి శ్రీకారం చుట్టబోతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. ఆగస్ట్ 20 నుంచి షూటింగ్ ప్రారంభించేలా నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇది మొదలైన కొద్దిరోజులకే బిగ్ బాస్ 5 రియాలిటీ షో కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం. అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తారట.

కొత్త ట్విస్ట్ ఏంటంటే మొదటి భాగంలో నాగార్జున జోడిగా నటించే నాగార్జున భార్య స్థానంలో రమ్యకృష్ణ బదులు శ్రేయను తీసుకున్నట్టు వినికిడి. కాల్ షీట్స్ సమస్యతో పాటు ఇతరత్రా రీజన్స్ ఏవో ఉన్నాయట. అందుకే బాగా అలోచించి మనంలో నాగ్ కు జోడిగా పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించిన శ్రేయకే ఓటు వేసినట్టు తెలిసింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో నేనున్నాను, సంతోషం లాంటి సూపర్ హిట్లు ఉన్నాయి. అధికారికంగా లాంచింగ్ రోజు దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బంగార్రాజు సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెలా లేక ప్రీక్వెలా అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు.

ఇందులో నాగ చైతన్య కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. తనకు జోడిగా కృతి శెట్టిని తీసుకున్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. రెమ్యునరేషన్ కూడా డిమాండ్ కు తగ్గట్టు భారీగా ఆఫర్ చేశారని ఇన్ సైడ్ న్యూస్. ఇదంతా బాగానే ఉంది కానీ అందరూ మర్చిపోయిన సోగ్గాడే చిన్ని నాయనాకు ఇప్పుడు కొనసాగింపు అంటే ప్రేక్షకులు ఎంతమేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ముందు 2022 సంక్రాంతికి దీన్ని తీసుకురావాలని నాగ్ ప్లాన్ చేసుకున్నప్పటికీ ఇప్పుడు మూడు పాన్ ఇండియా సినిమాలు, ఒక పవన్ కళ్యాణ్ మూవీ ఉండటంతో ఇక హడావిడి పడాల్సిన పనిలేదు. బంగార్రాజు తాపీగా వేసవిని లక్ష్యంగా పెట్టుకోవచ్చు

Also Read: మిలియన్ల లెక్కలు ఎలా ఉన్నాయి

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetcasibom