iDreamPost
android-app
ios-app

శ్రీవారి సేవలో మళ్లీ రమణ దీక్షితులు

శ్రీవారి సేవలో మళ్లీ రమణ దీక్షితులు

గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా సేవలందించిన రమణ దీక్షితులను తిరిగి మళ్లీ గౌరవ ప్రధాన అర్ఛకుడిగా వచ్చారు. ఈ మేరకు ఈ రోజు శనివారం టీటీడీ పాలక మండలి సమావేశంలో పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. పాలక మండలి నిర్ణయంతో రమణ దీక్షితులు తిరిగి శ్రీవారి సేవకు మార్గం సుగమమైంది.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో శ్రీవార ఆలయంలో కైంకర్యాలు సరిగా జరగడంలేదని, ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలో పూజా కార్యక్రమాలు జరగడంలేదని ప్రధాన అర్ఛకుడి హోదాలో రమణ దీక్షితులు విమర్శలు చేశారు. 2018 మే నెలలో రమణ దీక్షితులు ఈ విమర్శలు చేశారు. శ్రీవారిని పస్తులుంచుతున్నారని కూడా పేర్కొన్నారు. ఆభరణాల భద్రతపై కూడా సందేహం వ్యక్తం చేశారు. విలువైన ఆభరణాలు దేశం, ఖండం దాటిపోతున్నాయని ఆరోపించారు. ఆభరణాలు రక్షణపై ప్రత్యేక కమిటీ వేయాలని, సీబీఐ విచారణ జరిపి ఆభరణాల లెక్క చూసి భద్రపరచాలని డిమాండ్‌ చేశారు.

రమణ దీక్షితుల ఆరోపణలు, విమర్శలు అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో పదవీ విరమణకు వయస్సును నిర్థారిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవో ప్రకారం రమణ దీక్షితులను గౌరవ ప్రధాన అర్చకుడి బాధ్యతల నుంచి తప్పించారు. అనంతరం ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. తాజాగా ఆయన్ను తిరిగి గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమిస్తూ వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉన్న టీడీపీ బోర్డు నిర్ణయించింది. కాగా, రమణ దీక్షితుల పునర్నియామకంపై టీటీడీ పురోహితులు పలువురు చైర్మన్‌ సుబ్బారెడ్డి వద్ద ఆందోళన వ్యక్తం చేయగా, ఆయన వల్ల ఎలాంటి ఇబ్బంది రాదంటూ చైర్మన్‌ వారికి సూచించారు.