iDreamPost
android-app
ios-app

రామ్ మరో రిస్క్ కి సిద్ధం

  • Published Sep 15, 2022 | 5:51 PM Updated Updated Dec 11, 2023 | 11:24 AM

దాని తర్వాత తమిళ రీమేక్ తడంని తెలుగులో రెడ్ గా చేసిన రామ్ ఆశించిన గొప్ప ఫలితాన్ని అందుకోలేదు కానీ సంక్రాంతి సీజన్ పుణ్యమాని డిజాస్టర్ ని తప్పించుకున్నాడు.

దాని తర్వాత తమిళ రీమేక్ తడంని తెలుగులో రెడ్ గా చేసిన రామ్ ఆశించిన గొప్ప ఫలితాన్ని అందుకోలేదు కానీ సంక్రాంతి సీజన్ పుణ్యమాని డిజాస్టర్ ని తప్పించుకున్నాడు.

  • Published Sep 15, 2022 | 5:51 PMUpdated Dec 11, 2023 | 11:24 AM
రామ్ మరో రిస్క్ కి సిద్ధం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ అంటే క్లాస్ లోనే కాదు మాస్ లోనూ చాలా ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ విజయం అతని ఆలోచనా తీరునే మార్చేసింది. దాని తర్వాత తమిళ రీమేక్ తడంని తెలుగులో రెడ్ గా చేసిన రామ్ ఆశించిన గొప్ప ఫలితాన్ని అందుకోలేదు కానీ సంక్రాంతి సీజన్ పుణ్యమాని డిజాస్టర్ ని తప్పించుకున్నాడు. మాస్ మార్కెట్ ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదనే లక్ష్యంతో ఉన్న ఈ యూత్ హీరో ప్రాజెక్టుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. బోయపాటి శీనుతో చేతులు కలపడానికి కారణం అదే. అఖండ తర్వాత ఎన్ని క్రేజీ ఆఫర్లు వచ్చినా ఈ కాంబో సెట్ అయ్యిందంటే ఏ రేంజ్ ప్లానింగో అర్థం చేసుకోవచ్చు.
Ram is ready for another risk
ఇదయ్యాక గౌతమ్ మీనన్ తో రామ్ ఒక సినిమా చేయబోతున్నట్టు వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే ది వారియర్ రూపంలో అరవ దర్శకుడు లింగుస్వామిని గుడ్డిగా నమ్మినందుకు ఎంతటి దారుణమైన ఫ్లాప్ దక్కిందో ఎవరూ మర్చిపోలేరు. గౌతమ్ మీనన్ ని మరీ అంత తక్కువగా పోల్చలేం కానీ ఈయనా పెద్ద ఫామ్ లో లేరు. తమిళ ఆడియన్స్ కే గౌతమ్ సెన్సిబిలిటి ఎక్కువగా నచ్చుతుంది. మునుపటిలా మేజిక్ చేయలేకపోతున్న కారణంగానే గౌతమ్ మీనన్ గత కొంత కాలంగా దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చి నటన మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కనులు కనులు దోచాయంటే, సీతారామం లాంటి హిట్లలో చెప్పుకోదగ్గ పాత్రలే పోషించిన సంగతి విదితమే.

తాజాగా విడుదలైన ఆయన శింబుతో చేసిన కొత్త మూవీ(తెలుగులో లైఫ్ అఫ్ ముత్తు 17 రిలీజ్ కానుంది)కి పర్వాలేదు బాగుందనే రిపోర్ట్స్ వస్తున్నాయి. మునుపటి ఫామ్ ఇచ్చే స్థాయిలో విజయం సాధించిందో లేదో ఇంకో రెండు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. రామ్ తో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన కారణంగానే ఎవరూ అంతగా అడగని లైఫ్ అఫ్ ముత్తుని ఇక్కడ రిలీజ్ చేసేందుకు స్రవంతి రవికిశోర్ ముందుకొచ్చారనే టాక్ ఉంది. ఈ పరిణామం చూస్తే నిజమే అనిపిస్తోంది. బోయపాటి సినిమా పూర్తి చేయడానికి ఎంత లేదన్నా ఆరేడు నెలలు పడుతుంది. ఈలోగా గౌతమ్ మీనన్ రెడీ చేసిన ఫైనల్ స్క్రిప్ట్ ఓకే అయితే వెంటనే పట్టాలెక్కుతుంది. మరి రామ్ రిస్క్ కి రెడీనా చూద్దాం

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio