iDreamPost
iDreamPost
మహమ్మారి కారణంగా కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ పక్కనున్న, విలువైన తన ముంబై ఆఫీసును అమ్మేసినట్లు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇక బాలీవుడ్‌తో తన సంబంధాలన్నింటినీ తెంచుకున్నారా? ఆర్జీవీ ఏమన్నారు?
బాలీవుడ్ పరిశ్రమతో తన బంధాన్ని ఆర్జీవీ శాశ్వతంగా ముగించారా? కరోనా దెబ్బకి ముంబైలోని కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ పక్కన ఉన్న తన కంపెనీ కార్యాలయాన్ని విక్రయించినట్లు వెల్లడించారు RGV. సత్య, డి కంపెనీ, సర్కార్ లాంటి చిత్రాలతో, బాలీవుడ్ లో అత్యుత్తుమ డైరెక్టర్లలో ఒకరైన ఆర్జీవీ, దేశాన్నే కదిలించారు. ఇప్పుడు RGV ముంబైతో తన సంబంధాలన్నింటినీ తెంచుకున్నాడు. కరోనా టైంలో తన జీవితం, తన అనుభవాల గురించి మాట్లాడారు. ఇంతకీ తన ముంబై ఆఫీసును ఎందుకు అమ్మారు? మహమ్మారి వల్ల నేను కార్యాలయాన్ని అమ్మాల్సివచ్చింది. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నా ఫ్యామిలీ అక్కడే ఉంటోంది. కాబట్టి లాక్డౌన్లు ఉన్నప్పుడు, నేను గోవాకు మారాను. అక్కడే నా ఆఫీసు ఉందని అన్నారు. అంటే ఆర్జీవీ ముంబైను వదిలిపెట్టి గోవాకు షిఫ్ట్ అయ్యారు.
RGV లడ్కీ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆర్జీవీ ఎప్పుడూ బాలీవుడ్ సినిమాలకే పరిమితం కాలేదు. “నేను తెలుగు, హిందీలో రెండు సినిమాలు చేస్తున్నా. కొంతకాలం నుంచి ఈ మార్షల్ ఆర్ట్స్ చిత్రం చేస్తున్నాను, నేను కూడా రెండు తెలుగు సినిమాలు చేశా. నేను హిందీ సినిమా డైరెక్టర్ నే కాదు.ఈ మధ్య నేను తీసిన చాలా మంది చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. చాలామంది సినిమాలుకూడా బాగా ఆడలేదు. ఎవ్వరూ ఇతరులను టార్గెట్ చేయరు. సినిమాలు తీయడమే నా పని. నా సినిమా బాగా వస్తుందా లేదా అన్నది నా చేతుల్లో లేదు. ఏది నచ్చుతుందో అది ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తుందని ఆర్జీవీ చెప్పారు.