iDreamPost
android-app
ios-app

Ayodhya: వీడియో: అయోధ్య రాముడి సన్నిధిలో రామ్‌ చరణ్‌ క్రేజ్‌..

అయోధ్యలో రామ మందిర ప్రారంభంతో పాటు.. బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి పెద్ద ఎత్తున సెలెబ్రిటీలకు ఆహ్వానాలు అందాయి. స్టార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయోధ్యలో రామ మందిర ప్రారంభంతో పాటు.. బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి పెద్ద ఎత్తున సెలెబ్రిటీలకు ఆహ్వానాలు అందాయి. స్టార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Ayodhya: వీడియో: అయోధ్య రాముడి సన్నిధిలో రామ్‌ చరణ్‌ క్రేజ్‌..

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట పూర్తయింది. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్ప పూజ చేసి, విగ్రహ ప్రాణ ప్రతిష్టను పూర్తి చేశారు. దేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని టీవీల్లో, ఫోన్లలో వీక్షించారు. ఇక, ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానం అందించిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమనుంచి చిరంజీవి, రామ్‌ చరణ్‌లకు కూడా ఆహ్వానం అందింది. తండ్రీకొడుకులు ఇద్దరూ అయోధ్యకు వెళ్లారు. రాముడి సన్నిధిలో భక్తితో పరవశించారు.

ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. చిరంజీవి, రామ్‌ చరణ్‌ ఇద్దరూ కలిసి అయోధ్య రాముడి సన్నిధిలో కొంతమంది ముఖ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఐ న్యూస్‌కు చెందిన కెమెరామ్యాన్‌ చిరంజీవిని చూశారు. ఆ వెంటనే కెమెరాను అటువైపు తిప్పారు. ‘‘ ఆయన రామ్‌ చరణ్‌ తండ్రి. అందుకే కెమెరాను అటువైపు తిప్పా’’ అని కామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక, అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కఠిన దీక్ష చేపట్టారు. దాదాపు 11 రోజుల పాటు దీక్షను కొనసాగించారు. జనవరి 12వ తేదీన ఈ దీక్ష మొదలైంది. దీక్షలో ఉన్నన్ని రోజులు మోదీ కేవలం కొబ్బరి నీళ్లను మాత్రమే తాగుతూ వచ్చారు. చలిలో కూడా కేవలం నేలపై దుప్పటి వేసుకుని దానిపై పడుకునే వారు.

మోదీ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం సంప్రదాయ దుస్తుల్లో ఆలయంలోకి చేరుకున్నారు. శ్రీరాముడికి పట్టుపీతాంబరాలు, ఛత్రం, పాదుకలు తీసుకుని వచ్చారు. ఈ సమయంలో 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు మంగళ వాయిద్యాలు మోగించారు. మేళ తాళాలతో ఆయనకు వేద పండితులు ఆహ్వానం పలికారు. అనంతరం మోదీ ఆ వస్త్రాభరణాలను పండితులకు అందజేశారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. మరి, అయోధ్యలో రామ్‌ చరన్‌ క్రేజ్‌కు సంబంధించిన ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.