iDreamPost
iDreamPost
ఉప్పెనతో డెబ్యూనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు రెండేళ్ల నిరీక్షణ ఫలించింది. జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలనుకున్న సినిమా క్యాన్సిలవ్వడంతో ఇప్పుడు తెరపైకి రామ్ చరణ్ వచ్చాడు. మైత్రి మూవీస్ సమర్పణలో వెంకట సతీష్ కిలారుని నిర్మాతగా పరిచయం చేస్తూ తీయబోయే మూవీని ఇవాళ అధికారికంగా ప్రకటించారు. గురువు సుకుమార్ ఇందులో రచనతో పాటు నిర్మాణ భాగస్వామ్యం పంచుకోబోతున్నట్టు సమాచారం. అనౌన్స్ మెంట్ లో బ్యానర్ లోగో అయితే ఉంది. ఈ వార్త వారం రోజుల నుంచి ఫిలిం నగర్ సర్కిల్స్ లో తిరుగుతున్నప్పటికీ కొన్ని అనుమానాలు రేకెత్తినా ఫైనల్ గా వాటికి చెక్ పడినట్టు అయ్యింది.
ఇది బుచ్చిబాబుకి బంపర్ ఆఫర్. ఎందుకంటే RRR తర్వాత చరణ్ చేస్తున్న ఆర్సి 15 మీద ఏ రేంజ్ అంచనాలున్నాయో తెలిసిందే. శంకర్ ప్యాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్న ఆ యాక్షన్ గ్రాండియర్ కనక హిట్ అయితే ఆటోమేటిక్ గా 16వ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది. రంగస్థలం టైపు సబ్జెక్టు అంటున్నారు కనక బుచ్చిబాబు కరెక్ట్ గా కొట్టాడా ఈజీగా స్టార్ లీగ్ లోకి వెళ్ళిపోతాడు. పుష్ప రైటింగ్ లోనూ హస్తమున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి మెగా పవర్ స్టార్ దొరికితే ఏ రేంజ్ లో చూపిస్తాడో వేరే చెప్పాలా. కాకపోతే ఫ్యాన్స్ మాత్రం స్టార్ హీరోలను డీల్ చేసిన అనుభవం లేని బుచ్చిబాబు తమ హీరోని ఎలా డీల్ చేస్తాడోనని టెన్షన్ పడుతున్నారు.
కథకు సంబంధించిన బ్యాక్ డ్రాప్ తదితర వివరాలు ఇంకా బయటికి రాలేదు. సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్ లాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఏఆర్ రెహమాన్ పేరు విన్పిస్తోంది కానీ ఒకప్పటి మేజిక్ చేయలేకపోతున్న ఈ లెజెండరీ మ్యుజిషియన్ కన్నా లోకల్ ఫ్లేవర్ తో అదరగొట్టే దేవినే నయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా సైరా చేస్తానని ముందు ఒప్పుకుని ఆ తర్వాత వదలుకున్న రెహమాన్ వెంట పడేందుకు చరణ్ ఇష్టపడతాడా అనేది అనుమానమే. మొత్తానికి ఊహించని కాంబినేషన్ తో ఆర్సి 16 డిసైడ్ అయ్యింది. నిజానికి ఈ స్థానంలో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఉండాల్సింది. కానీ స్క్రిప్ట్ మెప్పించే విధంగా చెప్పలేకపోయాడు