iDreamPost
android-app
ios-app

‘777 చార్లీ’ హీరోకి రజినీకాంత్ ఫోన్..

  • Published Jun 23, 2022 | 7:30 AM Updated Updated Jun 23, 2022 | 7:30 AM
  • Published Jun 23, 2022 | 7:30 AMUpdated Jun 23, 2022 | 7:30 AM
‘777 చార్లీ’ హీరోకి రజినీకాంత్ ఫోన్..

కన్నడ హీరో రక్షిత్‌ శెట్టి ఇటీవల ‘777 చార్లీ’ అనే సినిమాతో వచ్చాడు. ఓ కుక్కతో ప్రయాణం ఎలా ఉంది అని కామెడీ, ఎమోషనల్ గా చూపించారు ఈ సినిమాలో. సినిమా రిలీజ్ అయిన దగ్గర్నుంచి చూసిన ప్రతి ఒక్కరు సినిమాని అభినందిస్తున్నారు. కొంతమంది అయితే సినిమా చూసి కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. ఇటీవల 777 చార్లీ సినిమా చూసి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.

777 చార్లీ సినిమాలో సంగీత శ్రింగేరి కథానాయికగా నటించగా కె. కిరణ్‌రాజ్‌ దర్శకత్వం వహించారు. తెలుగులో సురేష్‌ ప్రొడక్షన్స్‌పై హీరో రానా రిలీజ్‌ చేశాడు. జూన్‌ 10న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తుంది. తాజాగా ఈ సినిమా చూసి సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ హీరో రక్షిత్ శెట్టికి ఫోన్ చేసి అభినందించారు. ఈ విషయాన్ని హీరో రక్షిత్‌ శెట్టి సోషల్‌ మీడియా ద్వారా తెలిపాడు.

రక్షిత్ తన ట్వీట్ లో.. ఈ రోజు చాలా గొప్పగా మొదలైంది. రజనీకాంత్‌ సర్‌ ఫోన్‌ చేశారు. నిన్న రాత్రి 777 చార్లీ చూసి అద్భుతంగా ఉందని ఫీలయ్యారు. సినిమాను అంత క్వాలిటీగా, ఎంతో ఎమోషనల్ గా టచ్ చేసేలా తీయడం, క్లైమాక్స్‌ తెరకెక్కించిన విధానం, ఆధ్యాత్మిక కోణంలో ముగించడం బాగుందని అన్నారు. సూపర్ స్టార్ నోటి నుంచి అలాంటి మాటలు వినడం చాలా సంతోషంగా అనిపించింది.. థాంక్యూ రజనీకాంత్‌ సర్‌ అని పోస్ట్ చేశాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss