Arjun Suravaram
Arjun Suravaram
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 39 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడంతో యావత్తు తెలంగాణ సమాజం విషాదంలోమునిగిపోయింది.ఆయన కుటుంబాన్ని ఓదార్చాడం ఎవరి తరం కాలేదు. ఆయన చనిపోయి రోజులు గడుస్తున్న.. ఇంకా ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ సమాజం కోలుకోలేదు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తాజాగా సాయిచంద్ సతీమణి రజినికి ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది.
గురవారం తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా వేద రజిని సాయిచంద్ కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, హోం మంత్రి మహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఇదే కార్యమంలో మఠం భిక్షపతి కూడా తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల సాయి చంద్ గుండెపోటుతో మరణించగా.. ఆయన స్థానంలో రజనికి వేర్ కార్పొరేషన్ బాధ్యతలు తెలంగాణ ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఆ బాధ్యతలను చేపట్టారు. గత నెల 29 గుండెపోటుతో మరణించారు.
ఆరోజు నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలం కారుకొండలో ఉన్న ఫామ్ హౌస్‌కు సాయిచందర్ వెళ్లారు. అక్కడే ఆయనకు గుండెపోటు రావడంతో భార్య, డ్రైవర్, గన్‌మెన్ కలిసి నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. అయితే ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మరణంతో తెలంగాణ సమాజం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వంతో పాటు ప్రజలు అండగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా సాయిచంద్ సతీమణి కీలక బాధ్యతలు చేపట్టారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పేదలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలోనే డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ!