iDreamPost
android-app
ios-app

విరిగిన రైలు పట్టా.. సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం!

విరిగిన రైలు పట్టా.. సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం!

ఈ మధ్యకాలంలో  తరచూ రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నారు. కారణం ఏదైనప్పటికి రైళ్లు ప్రమాదానికి గురవుతున్నాయి. గూడ్స్ రైలు ప్రమాదానికి గురైన సందర్భంలో ఆర్థిక నష్టం జరగ్గా..ప్యాసెంజర్ రైళ్ల ప్రమాదంతో భారీ ప్రాణ నష్టం జరుగుతుంది.  ఇటీవలే ఒరిస్సా రాష్ట్రంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం యావత్త దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. దాదాపు 300 మంది ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనతో రైలు ఎక్కేందుకు  జనాలు భయపడుతున్నారు.

తాజాగా బాపట్ల జిల్లాలో కూడా  ఓ పెనుప్రమాదం తప్పింది. బాపట్ల జిల్లాలోని  చీరాల మండలం ఈపూరుపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగిపోయింది. గురువారం ఉదయం విజయవాడ నుంచి బెంగళూరుకు సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ బయలు దేరింది. అయితే ఈపూరుపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టా విరిగిపోయిన విషయాన్ని కీ మ్యాన్  గుర్తించాడు. ఈ ట్రైన్ ఈపూరు పాలెం సమీపానికి వచ్చే సరికి.. కీ మ్యాన్ ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశాడు. దీంతో అధికారులు సంఘమిత్ర  రైలును నిలిపేశారు. అనంతరం సిబ్బంది రైలు పట్టా విరిగిన ప్రాంతానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు.  ఆ తరువాత కాసేపటికి యథావిధిగా రైళ్ల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు.

ఈ ఘటనతో సుమారు అరగంట సేపు ఆ మార్గంలో తిరిగి పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. చీరాల, బాపట్ల, ఒంగోలు సమీపంలోని వివిధ స్టేషన్లలో ఐదు రైళ్లను నిలిపేశారు. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందిపడ్డారు.  ఇటీవల అదే ప్రాంతంలో రైలు పట్టా విరగడంతో మరమ్మతులు చేసినట్లు తెలిసింది. తాజాగా మరోసారి జరగడంతో స్థానికంగా చర్చనీయంశంగా మారింది. కీ మ్యాన్ గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని లేకుండా కోరమాండల్ రైలు ప్రమాదం తరహాలో జరిగి ఉండేదిని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి