iDreamPost
iDreamPost
గత కొన్ని రోజులుగా విశ్వక్ సేన్ వార్తల్లో హాట్ టాపిక్‌గా ఉన్న సంగతి తెలిసిందే. నడిరోడ్డు మీద ప్రాంక్ అంటూ రచ్చ రచ్చ చేసి విమర్శలపాలయ్యాడు. అయితే ఈ విషయంపై ఓ ఛానల్‌లో డిబేట్‌కి వెళ్లగా అక్కడ యాంకర్‌కి, విశ్వక్‌సేన్‌కి మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో యాంకర్ గెట్ అవుట్ అంటూ విశ్వక్‌ని వెళ్ళిపోమనడంతో విశ్వక్‌సేన్ ఓ అసభ్యకరమైన పదంతో యాంకర్‌ని దూషించి వెళ్ళిపోయాడు. దీంతో ఈ ఇష్యూ మరింత పెద్దదిగా మారింది.
గత రెండు రోజులుగా ఈ వివాదంలో కొంతమంది విశ్వక్‌సేన్ కి, కొంతమంది ఆ యాంకర్‌కి సపోర్ట్‌గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు, మీడియా ముందు మాట్లాడుతున్నారు. తాజాగా ఈ ఇష్యూపై ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ స్పందించాడు. ఈ మేరకు విశ్వక్ సేన్ కి సపోర్ట్ చేస్తూ, ఆ యాంకర్ ని, ఆ న్యూస్ ఛానల్ ని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశాడు.
రాహుల్ రామకృష్ణ.. ఇప్పుడు జరుగుతున్న ఈ సర్కస్ ఫీట్‌లో నేను కూడా పాల్గొనాలనుకుంటున్నాను. ఒక మంచి మనిషి అయిన విశ్వక్‌సేన్‌ను అవమానించడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. జర్నలిస్టులు అని చెప్పుకొని వాళ్ళేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ ఛానెల్ న్యూస్ తప్ప అన్నీ కవర్ చేస్తుంది. టీఆర్పీ కోసం ఏమైనా టెలికాస్ట్ చేస్తుంది. వాళ్ళు దేని గురించి పట్టించుకోరు. వాళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, బాగా ఫండ్స్ కూడా వస్తాయి. డబ్బుల కోసమే ఇలాంటివన్నీ చేస్తారు. ఈ ఇష్యూపై ఆ ఛానెల్ వాళ్లు పిలిస్తే లైవ్ డిబెట్‌లో కూడా పాల్గొనడానికి నేను రెడీ అంటూ వరుస ట్వీట్స్ చేశాడు. దీంతో రాహుల్ రామకృష్ణ చేసిన ఈ ట్వీట్స్ వైరల్‌గా మారాయి. మరి దీనిపై సదరు ఛానల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
I’d like to be a part of the circus that is surrounding and humiliating a grounded, humble person as #VishwakSen
He has my total support especially in light of how @TV9Telugu treated him. I don’t know what they do to journalists these days..jeez..— Rahul Ramakrishna (@eyrahul) May 3, 2022
Their news is about monetary benefits. It is just shameful that people salivate for the kind of nonsense that they mostly* perpetuate.
— Rahul Ramakrishna (@eyrahul) May 3, 2022
I really want @TV9Telugu to call me over for a live television debate.
— Rahul Ramakrishna (@eyrahul) May 4, 2022