iDreamPost
android-app
ios-app

Radhe Shyam : ప్రభాస్ సినిమాకు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి

  • Published Feb 02, 2022 | 4:50 AM Updated Updated Feb 02, 2022 | 4:50 AM
Radhe Shyam : ప్రభాస్ సినిమాకు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి

ఎట్టకేలకు రాధే శ్యామ్ విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటించారు. ముందే లీకైనట్టు మార్చి 11ని కన్ఫర్మ్ చేస్తూ కొత్త పోస్టర్ వదిలారు. అందులో షిప్పు తప్ప హీరో హీరోయిన్ కానీ ఇంకే ఇతర పాత్రలు కానీ లేకపోవడం గమనార్హం. అంటే టైం లేకపోవడం వల్లనో ఈ డేట్ కైనా కట్టుబడి ఉండగలమో లేదో అనే అపనమ్మకమో మొత్తానికి క్లియర్ అప్ డేట్ అయితే ఇచ్చారు. అయితే వినడానికి బాగానే ఉంది కానీ ఈ డేట్ కి ముందు వెనుకా చాలా రిస్క్ పొంచి ఉంది. అదేంటో చూద్దాం. సరిగ్గా ఒక్క రోజు ముందు సూర్య ఈటిని సన్ పిక్చర్స్ భారీ ఎత్తున విడుదల చేస్తోంది. తమిళనాడులో దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. గ్యాప్ గంటల్లో కాబట్టి కలెక్షన్లు ఎఫెక్ట్ అవుతాయి.

ఇక కర్ణాటకలో వారం తర్వాత అంటే మార్చి 17 నుంచి 23 వరకు పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ తప్ప ఇతర సినిమాలు ప్రదర్శించకూడదని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే తాత్కాలికంగా అయినా సరే రాధే శ్యామ్ ని ఎక్కువ థియేటర్లలో తీసేస్తారు. తిరిగి 25న ఆర్ఆర్ఆర్ వచ్చేస్తుంది కాబట్టి రాధే శ్యామ్ కు పడే దెబ్బ మాములుగా ఉండదు. హిందీలో చూసుకుంటే అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే 17న వస్తుంది. దానికీ భారీ ఎత్తున స్క్రీన్లు అవసరం పడతాయి. వాయిదా పడే ఛాన్స్ లేదని టీమ్ ఇప్పటికే చెబుతోంది కాబట్టి రాధే శ్యామ్ కు నార్త్ లో వారం లోపే వీలైనంత రావాలి.

ఇన్ని సవాళ్ల మధ్య రాధే శ్యామ్ కు హైప్ అయితే ఉంది కానీ మరీ ఆర్ఆర్ఆర్ రేంజ్ లో కాదన్నది మాత్రం వాస్తవం. ట్రైలర్ లో రాజమౌళి సృష్టించిన ఇంపాక్ట్ ని రాధాకృష్ణ తేలేకపోయాడు. ఉత్తరాది రాష్ట్రాల్లో రాధే శ్యామ్ కు పట్టం కట్టొచ్చన్న అంచనాలు ఉండవచ్చు కానీ ఇక్కడ తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కూడా కీలకమే. పైగా టాక్ బ్లాక్ బస్టర్ రేంజ్ లో వస్తేనే ఇప్పుడొచ్చే పాన్ ఇండియా సినిమాలు సేఫ్ అవుతాయి. ఏదో యావరేజ్ అంట కదా అనే మాట వినిపించినా ఆడియన్స్ కనికరం చూపించడం లేదు. సో రాధే శ్యామ్ ఈ ప్రతిబంధకాలన్నీ దాటుకుని విజయం సాధించడమే ఇప్పుడు కావాల్సింది

Also Read : Jr NTR & AR Rahman : యంగ్ టైగర్ ప్రాజెక్టుకు లెజెండరీ మ్యూజిక్