Keerthi
డీమార్ట్ సూపర్ మార్ట్స్ ఓనర్, భారత్ లో అత్యంత ధనవంతుల్లో ఒకరైన రాధాకిషన్ దమానీ గురించి అందరికి తెలిసిందే. అయితే ఈయన తాజాగా భారీ పెట్టుబడితో ఓ ల్యాండ్ ను కొనుగోలు చేశారు. ఇంతకి ఎక్కడంటే..
డీమార్ట్ సూపర్ మార్ట్స్ ఓనర్, భారత్ లో అత్యంత ధనవంతుల్లో ఒకరైన రాధాకిషన్ దమానీ గురించి అందరికి తెలిసిందే. అయితే ఈయన తాజాగా భారీ పెట్టుబడితో ఓ ల్యాండ్ ను కొనుగోలు చేశారు. ఇంతకి ఎక్కడంటే..
Keerthi
డీమార్ట్.. ప్రస్తుత కాలంలో ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే.. వంటసామగ్రి నుంచి దస్తులు,చెప్పులు, ఫర్నీచర్ ఇలా ఇంట్లోకి కావాల్సిన ప్రతిది ఈ డీమార్ట్ లో అందుబాటులో దొరుకుతాయి. కనుక ఈ డీమార్ట్ ఉన్న గీరాకి గూరించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంల లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు నిత్యం కస్టమర్ల రద్దీతో బిజీగా ఈ డీమార్ట్ లు ఉంటాయి. ఇక చిన్నగా ప్రారంభమైన ఈ వ్యాపారం క్రమక్రమంగా పుంజుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సామాన్యుల సూపర్ మార్కెట్ గా పేరు మోసుకుంది. ఇక ఈ డీమార్ట్ కేంద్రాల్ని అవెన్యూ సూపర్ మార్ట్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక దీని ఓనర్ రాధాకిషన్ దమానీ.
కాగా, ఈయన భారత్ లోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. అంతేకాకుండా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఈయన సంపద 22.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే భారత కరెన్సీలో చూస్తే దీని విలువ రూ.187 లక్షల కోట్లు. ఇక భారత్ ధనవంతుల జాబితాలో ఈయన 8వ స్థానంలో ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. తాజాగా ఈయన భారీ ఎకరాలలో ఓ ల్యాండ్ ను కొనుగోలు చేశారు. అయితే దీని కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారు. ఎక్కడ కోనుగోలు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. డీమార్ట్ సూపర్ మార్ట్స్ ఓనర్, భారత్ లో అత్యంత ధనవంతుల్లో ఒకరైన రాధాకిషన్ దమానీ తాజాగా భారీ పెట్టుబడితో ఓ ల్యాండ్ ను కొనుగోలు చేశారు. అయితే ఈ ల్యాండ్ ను దమానీ.. ముంబై ఛండీవలీ ప్రాంతంలోని 1.2 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.కాగా, ఈ భూమిని దమానీ రూ.117 కోట్లకు దక్కించుకున్నారు.
ఇకపోతే కంపెనీ తన వృద్ధి ప్రణాళికల్లో భాగంగా వరుసపెట్టి ప్లాట్లు కొంటునే ఉంది. అయితే ఈ ప్లాట్ ఇండస్ర్టియల్ జోన్ లో ఉంది. ఇక్కడ డీమార్ట్..రిటైల్ షాపింగ్ సెంటర్స్ , కమర్షియల్ బిల్డింగ్ ను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, దమానీ కంపెనీ ఈ ల్యాండ్ పార్సిల్ కు సంబంధించిన స్టాంపు డ్యూటీ కింద రూ. 7.03 కోట్లు చెల్లించింది. పైగా ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది మే6వ తేదీన జరిగిందని.. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ ప్లాట్ ఫాం CRE మ్యాట్రిక్స్ సంబంధిత డాక్యుమెంట్లలో ఉందని చెప్పింది. కానీ, గతేడాది డీమార్ట్.. తన రిటైల్ అవుట్‌లెట్ల విస్తరణకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 40 అవుట్‌లెట్స్ తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది.
అయితే గత వారంలో డీమార్ట్.. గుజరాత్ వల్సాద్‌లో కొత్తగా ఒక స్టోర్ తెరవగా.. మొత్తంగా దేశంలో ఇప్పుడు డీమార్ట్ కేంద్రాల సంఖ్య 367 కు చేరింది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరం చివరివరకు చూస్తే.. డీమార్ట్ రిటైల్ బిజినెస్ ఏరియా మొత్తంగా 15.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా.. ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కొత్తగా 41 స్టోర్లు తెరిచినట్లు పేర్కొంది. ఇకపోతే గత ఆర్థిక సంవత్సరంలో డీమార్ట్ నికర లాభం రూ. 2536 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. అంతకుముందు అంటే 2022-23లో ఇది రూ. 2378 కోట్లుగా ఉంది. ఆదాయం రూ. 50789 కోట్లుగా నమోదైంది.