iDreamPost

వీడియో: స్టార్‌ క్రికెటర్‌ ఇంట్లోకి చొరబడ్డ కొండచిలువలు!

వీడియో: స్టార్‌ క్రికెటర్‌ ఇంట్లోకి చొరబడ్డ కొండచిలువలు!

సాధారణంగా ఇళ్లలోకి అప్పుడప్పుడు పాములు రావటం సహజం. ఇండియాలోని పట్టణాలు, నగరాల్లో కంటే పల్లెటూళ్లలో ఎక్కువగా పాములు ఇంట్లోకి దూరే సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. కానీ, ఆస్ట్రేలియాలో పరిస్థితి వేరుగా ఉంటుంది. అడవులు ఎక్కువగా ఉండటం వల్ల పెద్ద సర్పాలు తరచుగా ఇళ్లలోకి వస్తూ ఉంటాయి. చాలా మందికి వాటిని ఎలా పట్టుకుని బయట వదిలేసేయాలో తెలిసి ఉంటుంది. ఒక్కోసారి పెద్ద పెద్ద సెలెబ్రిటీ ఇళ్లలోకి కూడా పాములు వస్తూ ఉంటాయి. తాజాగా, ప్రముఖ స్టార్‌ క్రికెటర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ఇంట్లోకి ఏకంగా మూడు కొండచిలువలు దూరాయి.

వాటిని స్వయంగా ఆయనే పట్టి బయట పడేశాడు. ఆ వివరాల్లోకి వెళితే.. గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో నివాసం ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ మూడు కొండచిలువలు ఆయన ఇంట్లోకి ప్రవేశించాయి. వాటిని చూసిన గ్లెన్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఫ్లోర్‌ను శుభ్రం చేసే కర్రతో ఓ కొండ చిలువ ఉన్న దగ్గరకు వెళ్లారు. దాన్ని కర్రతో నొక్కి పట్టి.. చేత్తో తోకను పట్టుకున్నారు. తర్వాత దాన్ని బయట పడేసి వచ్చారు. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

‘‘ సారా లియోన్‌ మెక్‌గ్రాత్‌ అందించిన ప్రోత్సాహంతో కోస్టల్‌ కార్పెట్‌ పైథాన్స్‌ను ఎంతో క్షేమంగా పొదల్లో విడిచి పెట్టడం జరిగింది’’ అని రాసుకొచ్చారు. ఆ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే.. మరికొంతమంది గ్లెన్‌ భయపడుతూ వాటిని పట్టాడంటున్నారు. మరి, ఇంట్లోకి చొరబడ్డ కొండచిలువలను గ్లెన్‌ స్వయంగా పట్టి బయట విడిచిపెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Glenn McGrath (@glennmcgrath11)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి