Uppula Naresh
Uppula Naresh
మాములుగా చాలా మంది ఫోన్ వెనకాల కరెన్సీ నోట్లు పెట్టుకుంటుంటారు. ఇలా పెట్టడం ద్వారా అత్యవసర సమయంలో సహాయపడడమే కాకుండా డబ్బులు పోగొట్టుకోకుండా భద్రపరుచుకోవచ్చని భావిస్తుంటారు. కానీ, ఫోన్ వెనకాల అలా కరెన్సీ నోట్లను పెట్టడం ఎంత డేంజరో అనేది ఎవరికీ తెలియని నిజం. అవును, మీరు విన్నది నిజమే. ఇలా ఫోన్ వెనకాల కరెన్సీ నోట్లు పెట్టడం అనేది మీ చావును మీరే కోరి తెచ్చుకున్నట్లే. అసలు ఫోన్ వెనకాల కరెన్సీ నోట్లు పెట్టడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? అసలు నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోన్ వెనకాల కరెన్సీ నోట్లు పెట్టడం వల్ల నష్టాలు:
ఫోన్ వెనకాల కరెన్సీ నోట్లు పెట్టడం చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. అసలు విషయం ఏంటంటే? మాములుగా చాలా మంది ఫోన్ కు అస్సలు గ్యాప్ ఇవ్వకుండా అదేపనిగా వాడినప్పడు అటోమెటిక్ గా ఆ ఫోన్ వేడెక్కుతుంది. ఆ సమయంలో మొబైల్ వెనకాల కరెన్సీ నోట్లు ఉన్నట్టైతో ఫోన్ నుంచి విడుదలయ్యే ఆ వేడి బయటకు పోకుండా కరెన్సీ నోటు అడ్డుపడుతుంది. తద్వారా ఆ వేడి ఎక్కువై ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా ఫోన్ వెనకాల కరెన్సీ నోట్లు పెట్టడం ద్వారా ప్రాణాలకే ప్రమాదం. ఇది నిపుణులు చెబుతున్న మాట. ఇక నుంచైనా ఫోన్ వెనకాల కరెన్సీ నోట్లు గాని ఇతరత్రా పేపర్లు పెట్టకూడదని సూచిస్తున్నారు. ఒకవేళ పొరపాటును పెడితే మాత్రం.. మీ చావును మీరే కోరి తెచ్చుకున్నట్లే. ఇదే కాకుండా మీ ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే మీ ప్రాణాలకే ప్రమాదమని కూడా హెచ్చరిస్తున్నారు
ఇది కూడా చదవండి: పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నిమిదిన్నర ఏళ్ల బాలుడు! అసలు స్టోరీ ఏంటంటే?