iDreamPost
iDreamPost
గతేడాది ఇంగ్లాండ్ టెస్టు సిరిస్ పర్యటనలో టీమ్‌ఇండియా కరోనా కేసులు పెరగడంతో చివరి టెస్టుని ఆడకుండా ఆపేసారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. అప్పుడు ఆగిపోయిన మ్యాచ్‌ను ఈ ఏడాది జులై 1 నుంచి 5 వరకు నిర్వహించాలని రెండు జట్ల బోర్డులు నిర్ణయించాయి. దీంతో ఇంగ్లాండ్ తో జరగనున్న ఒక్క టెస్ట్ మ్యాచ్ కి జట్టుని ఎంపిక చేసింది BCCI.
ఈ జట్టులో టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ ఛెతేశ్వర్ పుజారా ఎంపికయ్యాడు. గత కొంత కాలంగా ఫామ్‌లో లేని పుజారాని సెలెక్షన్ కమిటీ గత కొంతకాలంగా కొన్ని మ్యాచ్ లకు పక్కన పెట్టింది. అయితే ఇటీవల పుజారా ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్రికెట్‌లో పాల్గొన్నాడు. అక్కడ ససెక్స్ టీమ్ తరఫున ఆడి నాలుగు మ్యాచ్‌ల్లో రెండు ద్వితశకాలు, రెండు శతకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన పుజారాని సెలెక్షన్ కమిటీ ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు మ్యాచ్‌కు ఎంపిక చేసింది.
ఈ నేపథ్యంలో పుజారా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. జులైలో ఇంగ్లాండ్‌తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ కి నన్ను ఎంపిక చేసినందుకు, ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్‌లో నా ప్రదర్శనను గుర్తించినందుకు చాలా సంతోషం. ఇన్ని రోజులు అక్కడ మైదానాలలో పరుగులు చేయడం ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు నాకు మరింత సపోర్ట్ ఇవ్వనుంది. ప్రతిసారి లాగే ఈసారి కూడా మంచి ప్రాక్టీస్‌తో జట్టు విజయానికి నా వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు.