iDreamPost
android-app
ios-app

హరీష్ శంకర్ కొత్త సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగులు

హరీష్ శంకర్ కొత్త సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగులు

పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా అంటే అప్పట్లో దుమ్ము దులిపిన “గబ్బర్ సింగ్” గుర్తొస్తుంది.

హరీష్ శంకర్ పూరి జగన్ స్కూలుకి దగ్గరగా ఉన్న వ్యక్తి. పూరీ జగన్నాథ్ కూడా “కెమెరామన్ గంగతో రాంబాబు”లో బ్రహ్మానందం న్యూస్ రీడింగ్ సీనులో పవన్ కళ్యాణ్ పెళ్ళి ప్రస్తవాన ఒక లైన్లో తీసుకొచ్చి కామెడీ పండించారు.

సరిగ్గా ఇప్పుడు అలాంటి ఎట్మాస్ఫియర్ చూడబోతున్నామా అనిపిస్తోంది. త్వరలో పవన్-హరీష్ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది.

ఎంత వరకు నిజమో తెలీదు కానీ ఆ స్క్రిప్టులోనివి అంటూ నాలుగు డైలాగులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలుపెట్టాయి.

ఈ డైలాగ్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న ప్రశ్నలు, ట్రోల్స్ నుంచి ప్రభావితం అయినట్టుగా అనిపిస్తున్నాయి. ఆ ప్రశ్నలకి హీరోయిక్ సమాధానులుగా ఈ డైలాగ్స్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ డైలాగ్స్ ని పవన్ చెప్తున్నట్టుగా ఊహించుకుంటుంటే థియేటర్లో ఈలలు గ్యారెంటీ అనే అనిపిస్తోంది. 

కాస్త అటు ఇటుగా ఆ నాలుగు డైలాగ్స్ ఇవే:

1. “కృష్ణుడు, బలరాముడు ఇద్దరూ అన్నదమ్ములేరోయ్. అన్నయ్య వల్ల తమ్ముడు, తమ్ముడు వల్ల అన్నయ్య పాపులర్ అవ్వలా. ఇద్దరూ ఇండిపెండెంటుగా పవర్ఫుల్లే”.

2. “ప్రజలు దేవుళ్ళురోయ్. ప్రజాసేవ తపస్సు. ఓటమి, వెన్నుపోటు, ఎదురుపోటు, ఆటు పోటు అన్నీ తట్టుకుని ప్రజాసేవ చేస్తూ పారిపోకుండా నిలబడితేనే కరుణిస్తారు. నేను పారిపోయే టైపు కాదురోయ్”

3. “సూర్యుడు పగలంతా వెలుగుతాడు, ప్రజలకి వెలుగివ్వడానికి. అదే సూర్యుడు రాత్రి పూట చంద్రుడితో పొత్తు పెట్టుకుంటాడు. ప్రజలకి వెన్నెలవ్వడానికి. ప్రజాసేవ కోశం ఏ పొత్తైనా పర్లేదురోయ్”

4. “ఒక్క పెళ్లి చేసుకున్న రాముడే కాదురోయ్.. రెండు చేసుకున్న శివుడు, ఎనిమిది చేసుకున్న కృష్ణుడూ కూడా దేవుళ్ళే..భక్తితో చూడు. భార్యల్ని లెక్కేయకు” 

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis