iDreamPost
iDreamPost
IPL & T20 World Cup: రాబోయే రోజుల్లో థియేటర్ వినోదానికి డెఫినిషన్ మారబోతోంది. కేవలం సినిమాలే కాకుండా ఇకపై క్రికెట్ మ్యాచులను కూడా లైవ్ స్ట్రీమింగ్ రూపంలో వెండితెరపై ప్రదర్శించబోతున్నారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ ఇకపై పూర్తి స్థాయిలో కంప్లీట్ ప్యాకేజ్ లాగా వీటిని షోల రూపంలో వేయబోతున్నారు. దీనికి సంబంధించి భారతదేశంలో అతి పెద్ద మల్టీ ప్లెక్సుల్లో ఒకటైన పివిఆర్ ఆ దిశగా మొదటి అడుగు వేసింది. రాబోయే ఐపిఎల్ టి20 వరల్డ్ కప్ ని 35 నగరాల్లోని 75 స్క్రీన్లలో ప్రత్యేకంగా వేసేందుకు హక్కులు చేజిక్కించుకుంది. ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబైతో పాటు హైదరాబాద్ లాంటి సౌత్ సిటీస్ లోకూడా ఈ సౌకర్యం రాబోతోంది.
ఐసిసితో నేరుగా చేసుకున్న ఒప్పందం ద్వారా పివిఆర్ ఈ డీల్ ని ఫైనల్ చేసుకుంది. అయితే ఎన్ని కోట్ల రూపాయలకు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అక్టోబర్ 24న పాకిస్థాన్ తో ఇండియా ఆడబోయే మ్యాచ్ కు ఊహించనంత భారీ స్పందన ఏర్పడే అంచనాలు ఉన్నాయి. స్టేడియం టికెట్ అమ్మకాలకు ధీటుగా ఈ మల్టీ ప్లెక్స్ షోలకు కూడా ఆదరణ ఉంటుందని పివిఆర్ ధీమాగా ఉంది. సెమి ఫైనల్ ఫైనల్స్ సహా అన్ని మ్యాచులకు అగ్రిమెంట్ చేసుకున్నారు. మన దేశం ఆడేవాటికే డిమాండ్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ్యాచ్ నిడివి నాలుగు గంటల వరకు ఉంటుంది కాబట్టి టికెట్ ధర ఎంతనే క్లారిటీ ఇంకా రాలేదు.
ఇదో కొత్త ట్రెండ్ కి శ్రీకారం అని చెప్పొచ్చు. ఇందులోనూ కొన్ని రిస్కులు లేకపోలేదు. టికెట్లు అమ్మేశాక వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఆ మొత్తాన్ని ప్రేక్షకులకు వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. అది రెవిన్యూ మీద ప్రభావం చూపిస్తుంది. ఇండియా ఫైనల్ దాకా వెళ్తేనే పివిఆర్ కు ఇది లాభసాటి వ్యవహారం. లేదూ అంటే ఇతర దేశాలు ఆడే వాటికి అంత రెస్పాన్స్ ఉండకపోవచ్చు. ఇప్పుడీ మోడల్ ని ఆధారంగా చేసుకుని ఐసిసి ఇకపై కూడా అదనపు ఆదాయం తెచ్చే ఇలాంటి మార్గాలను ఇంకా వేగవంతం చేయనుంది. సినిమా తర్వాత ఆ స్థాయిలో క్రికెట్ ని ప్రేమించే చోట ఇప్పుడీ ప్లాన్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
Also Read : Sardar Udham : సర్దార్ ఉధమ్ సినిమా రిపోర్ట్