iDreamPost
android-app
ios-app

నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన రాష్ట్రపతి

నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన రాష్ట్రపతి

నిర్భయ ఘటనలో నిందితుడైన ముఖేష్ కుమార్ సింగ్ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో నిర్భయ దోషులకు ఉరి అమలుకు మార్గం సుగమం అయింది.

కాగా రాష్ట్రపతి పిటిషన్ ను తిరస్కరించిన 14 రోజుల తర్వాత మాత్రమే ఉరి శిక్షను అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ నిందితుల్లో ఇద్దరికి క్యూరేటివ్ పిటిషన్ ను దాఖలు చేసుకునే వెసులుబాటు ఉండటంతో 14 రోజుల తర్వాత అయినా ఉరిశిక్ష అమలవుతందని చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే ఈనెల 22 న ఉరిశిక్ష అమలు చేయడానికి వీలు పడదని ఢిల్లీ ప్రభుత్వం తేల్చిచెప్పిన విషయం తెలిసిందే.

కాబట్టి ఈ నెల 22 న నిర్భయ దోషులకు దాదాపుగా ఉరిశిక్ష అమలవ్వడం జరగదని చెప్పవచ్చు. చట్టాల్లో ఉన్న లొసుగుల వల్లనే శిక్ష ఖరారుకు ఆలస్యం అవుతుందని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఇకనైనా చట్టాలను మార్చవలసిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.