Keerthi
Hanuman Movie:ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ మూవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టికెట్ నుంచి వచ్చే డబ్బులను అయోధ్యకే కాకుండా ఇక నుంచి ఆ ఆలయాలకు కూడా అందజేస్తామని ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యాలు చేశారు.
Hanuman Movie:ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ మూవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టికెట్ నుంచి వచ్చే డబ్బులను అయోధ్యకే కాకుండా ఇక నుంచి ఆ ఆలయాలకు కూడా అందజేస్తామని ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యాలు చేశారు.
Keerthi
యంగ్ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబీనేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. ఇందులో హీరోయిన్ గా అమృతా అయ్యర్ నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో అలరించారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అలాగే హనుమాన్ మూవీని రెండు తెలుగు రాష్ట్రల్లోనే కాకుండా.. ప్రపంచ దేశాల్లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వర్షం కురిసింది. ఇప్పటికే హనుమాన్ మూవీ రూ.250 కోట్లు రాబట్టగా.. త్వరలోనే రూ.300 కోట్ల వైపు శర వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే హనుమాన్ చిత్ర బృందం గ్రాటిట్యూడ్ మీట్‌ను గ్రాండ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
హనుమాన్ మూవి మంచి విజయం సాధించిన సందర్భంగా.. చిత్ర బృందం నిర్వహించిన కార్యక్రమంలో హీరో తేజ సజ్జా, అమృతా అయ్యర్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. హనుమాన్ మూవీని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ఆ దేవుళ్లకు, చిత్ర బృందానికి పేరుపేరనా థ్యాంక్స్ చెప్పారు. అలాగే మా ఈ విజయంలో మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ వారిది కూడా కీలక పాత్ర ఉంది. కనుక వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. ఇక ఈ హనుమాన్ మూవీకి సంబధించి మున్ముందు చాలా వేడుకలు జరగనున్నాయి. దీనితో పాటు యాభై రోజుల వేడుకలోకి పని చేసిన వారందరికీ ప్రత్యేక బహుమతులు, కానుకలు అందజేయబోతున్నాం అని తెలిపారు.
ఇక హనుమాన్ సినిమాను ప్రేక్షకులు ఒక పవిత్ర దేవాలయంగా భావిస్తున్నారు. ఈ మూవీని చూడడం ద్వారా చాలామంది ప్రేక్షకులు వారికి తెలియకుండానే అయోధ్య రామ మందిరానికి రూ. 5 విరాళంగా అందజస్తున్నారు. ఇంతటి ఘనత నిర్మాత నిరంజన్ కృషితోనే సాధ్యపడింది. ఇప్పటి నుంచి ఈ విరాళాలు కేవలం అయోధ్య రాముడికే కాదు, భద్రాది రామయ్యకు తదితర ఆలయాలకు కూడా అందజేస్తాం. అలాగే మా ఈ సినిమాను వెన్నెముకలా నడిపించిన హనుమంతుల వారికీ రాముల వారికి ప్రేక్షకులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం’ అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. మరి, హనుమాన్ మూవీ నుంచి భద్రాదితో పాటు తదితర ఆలయాలకు విరాళం అందజేస్తాం అంటూన్న ప్రశాంత్ వర్మ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The Superpower of devotion Unleashed on the global stage ❤️🔥#HANUMAN collects 2️⃣5️⃣0️⃣ CRORES Worldwide in just 15 Days 💥💥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123#HanuManRAMpage #HanuManEverywhere@Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @GowrahariK… pic.twitter.com/xt2BZ3YtdE— Primeshow Entertainment (@Primeshowtweets) January 27, 2024