iDreamPost
iDreamPost
నిన్న విశ్వక్ సేన్ కు సంబంధించిన ప్రాంక్ వ్యవహారం చాలా మలుపులు తీసుకోవడంతో సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద చర్చే జరిగింది. టీవీ9 స్టూడియోకు వెళ్ళాక జరిగిన పరిణామాలు ఈ వివాదాన్ని మరింత పెంచాయి. అభ్యంతరకమైన ఇంగ్లీష్ పదాన్ని ఉపయోగించినందుకు విశ్వక్ సేన్ పబ్లిక్ సారీ చెప్పేశాడు. ఇక్కడితో అయిపోయిందా అంటే నో అనే చెప్పాలి. పబ్లిక్ రోడ్ మీద పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానన్న ఫ్యాన్ ఎపిసోడ్ మీద పరస్పరం కేసులు నడుస్తున్నాయి కాబట్టి అవి కంక్లూజన్ కు వచ్చే దాకా తేలినట్టే. ఇంకో మూడు రోజుల్లో అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా విడుదల కాబోతోంది. పెద్దగా అంచనాలేమి లేవు.
ఇదంతా పబ్లిసిటీ కోసమే చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ ఓవరాల్ గా చూస్తే ప్రాంక్ ఎపిసోడ్ పక్కా డ్రామా అనే క్లారిటీ వచ్చేసింది. మరి ఛానల్ లో జరిగిన రాద్ధాంతం కూడా ప్లాన్డ్ గా జరిగిందా అంటే ఏమో చెప్పలేం. తనను తానే అవమానపరుచుకునేలా విశ్వక్ ముందే సెట్ చేసుకుంటాడని అనుకోలేం. ఎందుకంటే ఇలాంటి నెగటివ్ పబ్లిసిటీ సినిమాకు చేసే మేలు ఏముండదు. కాంట్రావర్సీలతో హైప్ వస్తుంది కానీ ఇలాంటి వాటితో కాదు. సో అనుకోకుండా నోరు జారడమైతే యాంకర్ అండ్ విశ్వక్ ఇద్దరిలోనూ జరిగింది. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, మూవీ రిలీజ్ అయ్యాక అంతా చల్లబడుతుందా అంటే ఇంకో వారం ఆగి చూడాలి.
పాగల్ ఓ మాదిరిగా వర్కౌట్ అయినప్పటికీ దాని ఫైనల్ రిజల్ట్ పట్ల విశ్వక్ సేన్ ఏమంత హ్యాపీగా లేడు. అందుకే ఆశలన్నీ అశోక వనంలో అర్జున కళ్యాణం మీదే పెట్టుకున్నాడు. అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ ఈసారి టార్గెట్ లో ఉన్నారు. బాక్సాఫీస్ దగ్గర అసలే చిన్న సినిమాలకు దినదినగండంగా ఉంది. కంటెంట్ చాలా బలంగా ఉందంటే తప్ప జనం థియేటర్లకు రావడం లేదు. మరి అశోక వనంలో కనక నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఉంటే కనక ఓపెనింగ్స్ కాకపోయినా పికప్ ని ఆశించవచ్చు. అందులోనూ మే 6న వస్తున్న జయమ్మ పంచాయితీ, భళా తందానాన కంటే రవ్వంత ఎక్కుడ ఎడ్జ్ విశ్వక్ మూవీకే కనిపిస్తోంది. చూద్దాం ఏమవుతుందో