iDreamPost
android-app
ios-app

పూజాహెగ్డే.. టాలీవుడ్‌లో వెంకటేష్‌తో స్పెషల్ సాంగ్.. బాలీవుడ్‌లో వెంకటేష్‌కి చెల్లెలుగా..

  • Published May 17, 2022 | 7:12 PM Updated Updated May 17, 2022 | 7:12 PM
  • Published May 17, 2022 | 7:12 PMUpdated May 17, 2022 | 7:12 PM
పూజాహెగ్డే.. టాలీవుడ్‌లో వెంకటేష్‌తో స్పెషల్ సాంగ్.. బాలీవుడ్‌లో వెంకటేష్‌కి చెల్లెలుగా..

పూజాహెగ్డే ప్రస్తుతం సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా సూపర్ ఫామ్ లో ఉంది. తమిళ్, తెలుగు, హిందీలలో పూజాకి దాదాపు అరడజను పైనే సినిమాలు ఉన్నాయి. ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే, మరో పక్క స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది. గతంలోనే జిగేలు రాణి అంటూ రంగస్థలంలో చిందేసింది. తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న ‘ఎఫ్‌3’ సినిమాలో పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ కూడా రిలీజ్ అయింది.

అయితే ఇక్కడ టాలీవుడ్ లో వెంకటేష్ తో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసి బాలీవుడ్ లో వెంకటేష్ కి చెల్లెలుగా నటించడానికి సిద్ధమైంది పూజా. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌, వెంకటేష్‌లు చాలా కాలం నుంచి మంచి స్నేహితులు. దీంతో సల్మాన్ ప్రస్తుతం చేస్తున్న ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ సినిమాలో వెంకటేష్‌ని నటించమని అడగగా వెంకటేష్ ఒప్పుకున్నాడు. సల్మాన్, వెంకటేష్ కలిసి నటించబోతున్నారని గతంలోనే ప్రకటించారు.

అయితే ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది కూడా. వెంకటేష్ చేయబోయేది పూజాకి అన్నయ్య పాత్ర అని బాలీవుడ్ నుంచి సమాచారం. ‘కభీ ఈద్‌ కభీ దివాళి’ సినిమాలో వెంకటేష్, పూజా అన్నా చెల్లెళ్లుగా నటించనున్నట్టు తెలుస్తుంది. దీంతో ఆడియన్స్, నెటిజన్లు ఇక్కడేమో వెంకటేష్‌తో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసి అక్కడ చెల్లెలుగా ఎలా ఒప్పుకున్నావు అని అడుగుతున్నారు. మరి ఇదే నిజమై తెరపైన కనిపిస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetboo girişgrandpashabet