iDreamPost
android-app
ios-app

8 ఏళ్ళ తర్వాత పూజా హెగ్డే ఎంట్రీ

  • Published Feb 29, 2020 | 12:52 PM Updated Updated Feb 29, 2020 | 12:52 PM
8 ఏళ్ళ తర్వాత పూజా హెగ్డే ఎంట్రీ

అదేంటి ఆల్రెడీ ఇక్కడ టాలీవుడ్ లో భీభత్సమైన ఫామ్ లో ఉన్న పూజా హెగ్డే కొత్తగా ఎంట్రీ ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోకండి. మ్యాటర్ వేరే ఉంది. ఇప్పుడంటే బ్లాక్ బస్టర్ హిట్స్ తో వెలిగిపోతోంది కానీ ఒకటైంలో తనకు ఐరన్ లెగ్ అనే పేరు గట్టిగా ఉండేది. ఇక్కడ డెబ్యూ చేసినప్పుడు కూడా ముకుందా, ఒక లైలా కోసం రెండూ డిజాస్టర్ అయ్యాయి. హాలీవుడ్ లో ట్రై చేసినా అక్కడా ఇదే అనుభవం ఎదురయ్యింది. తర్వాత ఏ ముహూర్తంలో దర్శకుడు హరీష్ శంకర్ డీజే ఆఫర్ ఇచ్చాడో కానీ అక్కడి నుంచి అమ్మడి జాతకమే మారిపోయింది.

తెలుగులో వరసగా అగ్ర హీరోల ఆఫర్లు క్యూ కడుతుండగా మరోవైపు బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళ నుంచి పిలుపు రావడం భామ రేంజ్ ని ఎక్కడికో తీసుకెళుతోంది. ఇక అసలు విషయానికి వద్దాం. పూజా హెగ్డే మొదటి సినిమా 2012లో వచ్చిన మూగమూడి. తెలుగులో మాస్క్ గా డబ్బింగ్ చేశారు. ఇది డిజాస్టర్. తర్వాత అక్కడెవరూ తనను పలకరించలేదు. అందులోనూ ఫాంలో లేని వాళ్ళ వైపు తొంగిచూడని అరవ దర్శకుల కళ్ళకు పూజా అంతగా ఆనలేదు. అందుకే ఒక్క సినిమాతోనే తమిళ్ లో అవకాశాలు ఆగిపోయి వెయిట్ చేస్తూ వచ్చింది పూజా.

ఇప్పుడు ఇన్నేళ్లకు అంటే ఎనిమిదేళ్ల తర్వాత కోలీవుడ్ నుంచి తనకు పిలుపు వచ్చిందని టాక్. విజయ్ నటించబోయే మూవీకి తన పేరే పరిశీలనలో ఉందని చెన్నై అప్ డేట్. ప్రస్తుతం మాస్టర్ షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్ ఆ తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో నటించబోతున్నాడు. గతంలో గురు లాంటి సక్సెస్ ఫుల్ మూవీని, ప్రస్తుతం సూర్యతో ఆకాశం నీ హద్దురా చేస్తున్న సుధాకు స్టోరీ ఇప్పటికే లాక్ అయ్యిందట. మాస్టర్ విడుదల కాగానే ఇది మొదలుపెట్టే అవకాశం ఉంది. అయితే పూజా హెగ్డే ఒప్పుకుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరితో చేసినా కనీసం రెండు వందల కోట్లకు తక్కువ కాకుండా బిజినెస్ చేస్తున్న విజయ్ సరసన జంటగా నటించడమంటే జాక్ పాట్ కొట్టినట్టే.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın albetrabetraMadridbetkatlaMarsbahis GirişCasibom GirişJojobet GirişCasibomMarsbahis Giriş