హైదరాబాద్ లో దారుణం.. తప్పతాగి యాక్సిడెంట్ చేసిన CI

సమాజంలోని అరాచక శక్తులను అరికట్టడం పోలీసుల బాధ్యత. సమాజాభివృద్ధిలో వారిది కీలకమైన పాత్ర. ఎక్కడ ఎలాంటి.. నేరాలు జరకుండా.. అరికట్టేందుకు పోలీసులు ఉంటారు. అలానే మద్యం తాగి ప్రమాదాల చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఇలా సమాజానికి ఆదర్శంగా ఎందరో పోలీసులు ఉంటుంటే.. కొందరు మాత్రం పోలీస్ శాఖకు అపకీర్తి తెస్తున్నారు. తాజాగా హైదరాబాద్ బొల్లారంలో ఓ సీఐ తప్పతాగి వాహనాన్ని నడిపాడు. అంతేకాక యాక్సిడెట్ కూడా చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

హైదరాబాద్ లోని కమాండ్ కంట్రలో లో శ్రీనివాస్ సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు. బొల్లారంలో  తప్పతాగి వాహనాన్ని నడిపాడు. ఎదురుగా వస్తున్న కూరగాయల వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలోఆ వాహనం డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సీఐకి బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయగా.. 210 పాయింట్లు వచ్చినట్లు తెలుస్తోంది. కమాండ్ కంట్రోల్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్.. డీఎస్పీ ప్రమోషన్ లిస్టులో కూడా ఉన్నారు. అంతేకాక తప్పతాగి సీఐ చేసిన యాక్సిడెంట్ లో కూరగాయల లోడ్ తో వెళ్తున్న వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

ప్రమాదానికి కారణమైన వ్యక్తి పోలీస్ కావడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆయన సీఐ కావడంతో ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి స్థానికులు ఆరోపించారు. ఒక బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్న అధికారి ఇలా తప్పతాగి వాహనం నపడటం క్షమించరాని నేరమని స్థానికులు అంటున్నారు. ఉన్నతాధికారులు దీన్ని సీరియస్ గా తీసుకోని.. ఆయన తగిన శిక్ష పడాలని కోరుకున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదీ చదవండి: తల్లిని మందలించిన తండ్రి.. మనస్తాపంతో కుమార్తె..!

Show comments