Keerthi
హైదరాబాద్ మహా నగరంలో డ్రగ్స్ సేవిస్తున్న ఓ ముగ్గురిని పోలీసులు తాజాగా ఆరెస్టు చేశారు. వీరిలో ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు కూడా ఉన్నాడు.ఇంతకి ఎవరంటే..
హైదరాబాద్ మహా నగరంలో డ్రగ్స్ సేవిస్తున్న ఓ ముగ్గురిని పోలీసులు తాజాగా ఆరెస్టు చేశారు. వీరిలో ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు కూడా ఉన్నాడు.ఇంతకి ఎవరంటే..
Keerthi
దేశంలో మాదక ద్రవ్యాల వాడకం అనేది రోజు రోజుకి విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఎక్కువ శాతం యువత ఈ డ్రగ్స్ వలలో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. వీటిని ఆరికట్టేందుకు అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రల్లో ఈ డ్రగ్స్ ముఠా అనేది చాప కింద నీరులా క్రమేపి పెరిగిపోతుంది. ఇప్పటికే ఈ డ్రగ్స్ దందా పై పోలీసులు నిఘా పెట్టి పట్టుబడిన ఘటనలు చాలా ఉన్నాయి. అయిన ఏదో ఒక రూపంలో తరుచుగా ఈ డ్రగ్స్ దందా అనేది వెలుగులోకి వస్తునే ఉంది. తాజాగా మరోమారు హైదరాబాద్ మహా నగరంలో డ్రగ్స్ ను సేవించి పట్టుబడటం అనేది తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ఈ మధ్యకాలంలో నగర వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు అనేవి తరుచు పట్టుబడుతునే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లోని మరోమారు కోకైన్ సేవిస్తున్నా ఓ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్ లో చోటుచేసుకుంది. ఆ స్టార్ హోటల్లో పార్టీ చేసుకునేందుకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు కోకైన్ సేవిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆ ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే వీరిలో ఒకరరు బీజేపీ నేత, వ్యాపారవేత్త కుమారుడు యోగానందగా పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. అయితే వీరు ఈ కొకైన్‌ను ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు, ఎవరు ఇచ్చారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఇక, నగరంలో చాలామంది యువత ఈ మాదక ద్రవ్యాలకు బానిసలై.. పబ్స్, రెస్టారెంట్స్, అపార్ట్‌మెంట్స్ అని తేడా లేకుండా పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇటీవలే చాలామంది సినీ సెలబ్రీటిస్ సైతం ఈ డ్రగ్స్ మాఫియాలో పట్టబడిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు పెద్ద ఎత్తునే ఈ డ్రగ్ పెడర్లను, కన్జ్యూమ్ చేసే వ్యక్తులపై నిఘా పెడుతున్నారు. మరి, నగరంలో స్టార్ హోటల్లో కోకైన్ సేవిస్తూ పట్టబడిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.