Dharani
కేంద్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. వారికి ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు ప్రయోజనం కలిగించే కార్యక్రమాన్ని అమలు చేయబోతుంది. ఆ వివరాలు..
కేంద్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. వారికి ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు ప్రయోజనం కలిగించే కార్యక్రమాన్ని అమలు చేయబోతుంది. ఆ వివరాలు..
Dharani
బ్రిటీష్ వారి రాక ముందు వరకు మన దేశంలో చేతి వృత్తులు చేసుకునే వారికి మంచి ఆదాయం ఉండేది. ఆ తర్వాత క్రమంగా వారి ప్రభావం తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు గ్రామాల్లో సైతం చేతి వృత్తులు చేసుకునే వారు చాలా తక్కువ. కొన్ని వృత్తుల వారైతే పూర్తిగా కనుమరుగయ్యారు. ఈ క్రమంలో సంప్రదాయ చేతి వృత్తుల వారిని ప్రోత్సాహించి.. వారి ఆదాయం పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఓ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలసిఇందే. దీని ద్వారా సుమారు ఐదేళ్ల వ్యవధిలో.. సంప్రదాయ చేతి వృత్తులు చేసుకునే వారి కోసం 15 వేల కోట్ల రూపాయలు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇక తాజాగా ఈ పథకానికి సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు..
సంప్రదాయ చేతి వృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం.. పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. సంప్రదాయ పనిముట్లు, చేతులను ఉపయోగించి.. పని చేసే కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేడయమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. వారు చేసే ఉత్పత్తుల నాణ్యతను పెంచి.. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌తో వారిని అనుసంధానించి.. ఆదాయాన్ని పెంచేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కళాకారులు, చేతి వృత్తుల వారికి ఈ పథకం వర్తిస్తుంది. అయితే ముందుగా 18 సంప్రదాయ వృత్తులకు చెందిన వారికి ఈ స్కీమ్ ప్రయోజనాలు అందనున్నాయి.
ఈ పథకం ద్వారా ఆయా వృత్తుల వారికి పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్‌తో పాటుగా.. గుర్తింపు కార్డును కూడా ఇస్తారు. అలానే తొలి విడత కింద లక్ష, రెండో విడత కింద 2 లక్షల రూపాయల రుణం మంజూరు చేస్తారు. దీని కి కేవలం 5 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తారు. అలానే చేతి వృత్తుల వారి కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ బేసిక్ నుంచి అడ్వాన్డ్స్ స్థాయి వరకు ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయి. శిక్షణ తీసుకునే వారికి రోజుకు 500 రూపాయల చొప్పున స్టైఫండ్ కూడా ఇస్తారు.
అలానే చేతి వృత్తులు వారు తమకు అవరసరమైన పారిశ్రామిక పనిముట్ల కొనుగోలు కోసం అవసరమైన వారికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. అయితే వీరిలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు గతంలోనే తెలిపారు. ఇక ఈ స్కీమ్ ప్రారంభించిన 20 రోజుల్లోనే దేశవ్యాప్తంగా సుమారు 5.24 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇక ఇప్పుడు టూల్ కిట్ కోసం అప్లై చేసుకోవాల్సిందిగా కేంద్రం కోరుతుంది.