నేను DPని మార్చాను. మీరు మార్చారా?

ఆగస్ట్ 2-15 మధ్య సోషల్ మీడియాలో ‘త్రివర్ణస‌ను ప్రొఫైల్ పిక్చర్‌గా ఉప‌యోగించి “హర్ ఘర్ తిరంగా”ను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్ర‌ధాని కోరారు.

ప్రధాని మోడీ ఈరోజు తన సోషల్ మీడియా ఖాతాలలో డీపీ అంటే డిస్ ప్లే పిక్చ‌ర్ గా “తిరంగా” (త్రివర్ణ ప‌తాకం, జాతీయ జెండా)గా మార్చారు. అంద‌రికీ అదే విధంగా చేయ‌మ‌ని కోరారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

“ఇది ఆగస్టు 2వ తేదీ ప్రత్యేకం. మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న వేళ‌, మన దేశం మన త్రివర్ణ పతాకాన్ని జరుపుకోవడానికి # హర్‌ఘర్‌తిరంగ సామూహిక ఉద్యమం సిద్ధంగాఉంది. నా సోషల్ మీడియా పేజీలలో DPని మార్చాను. మీరంతా అలాగే మార్చాలి’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

జాతీయ పతాకాన్ని రూపొందించిన తెలుగువాడైన‌ పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా, ఆయనకు ప్రధాని నివాళులర్పించారు.

“మహానీయుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. ఎంతో గర్వించే త్రివర్ణ పతాకాన్ని మనకు అందించినందుకు మన జాతి ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. దేశ ప్రగతి కోసం, త్రివర్ణ పతాకాన్ని స్ఫూర్తిగా తీసుకుని పని చేస్తూనే ఉంటాం. ’’ అని మరో ట్వీట్‌లో చెప్పారు.


ప్ర‌ధాని డీపీ మార్చిన‌వెంట‌నే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాతోపాటు, ఇత‌ర సీనియర్ బిజెపి నాయకులు కూడా ప్రధాని అనుసరించి డీపీని “తిరంగా”గా మార్చుకున్నారు.

ఆదివారం రేడియో ప్రోగ్రామ్ ‘మన్ కీ బాత్’లో, ఆగస్టు 2 నుంచి 15 వ‌ర‌కు సోషల్ మీడియాలో “త్రివర్ణ” ను ప్రొఫైల్ ఫోటోలుగా వాడి “హర్ ఘర్ తిరంగా” ను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.

Show comments