రైతులకు గుడ్ న్యూస్.. ఈసారి ముందుగానే అకౌంట్లలోకి డబ్బులు?

రైతులకు గుడ్ న్యూస్.. ఈసారి ముందుగానే అకౌంట్లలోకి డబ్బులు?

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది. అంతేకాక రైతుల ఆదాయాలను పెంచేందుకు వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. అలానే పీఎం కీసాన్ స్కీమ్ ద్వారా రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తుంది. ఇప్పటికే పలుమార్లు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. అలానే తాజాగా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించబోతోందా?. పీఎం కిసాన్ పథకంలో  చేరిన వారికి ఊరట కలిగే నిర్ణయం తీసుకోనుందా?. కొన్ని నివేదికల ప్రకారం చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇదే జరిగితే అయితే తాజాగా మరోసారి  రైతులకు  గుడ్ న్యూస్ అందనుంది.

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసింది. రైతులకు పెట్టుబడులు, ఇతర అవసరాల నిమిత్తం కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది. మోదీ ప్రభుత్వం ఇప్పటికే పలు విడతల్లో డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేసింది. కేంద్రం అర్హత కలిగిన రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏటా రూ. 6 వేలు అందిస్తోంది.  తాజాగా 15వ విడత డబ్బులను కూడా రైతులకు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ముందుగానే అకౌంట్లలో జమ చేయొచ్చని నివేదికలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే చాలా మందికి రైతులకు లాభం కలుగుతుంది. పండుగల నేపథ్యంలో మోదీ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. నివేదిక ప్రకారం చూస్తే.. వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగుల నేపథ్యంలో ఈసారి పీఎం కిసాన్ రైతులకు ముందుగానే అకౌంట్లలో డబ్బులు జమ కావొచ్చు.

అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ  ప్రధానమంత్రి కిసాన్ 15వ విడత డబ్బుల అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నివేదికల ప్రకారం చూస్తే.. పీఎం కిసాన్ డబ్బులు దసరా లేదా దీపావళికి రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ కావొచ్చుని తెలుస్తోంది. అందువల్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎదురు చూడాల్సి ఉంది. ఇప్పటికే 14 విడతల డబ్బులు రైతుల అకౌంట్లో జమ అయ్యాయి. ఇకపై 15వ విడత డబ్బులు రావాల్స ఉంది. 15వ విడత డబ్బులు ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్యలో అన్నదాతలకు లభించనున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా చూసినట్లు అయితే దసరా లేదా దీపావళి పండుగలకు కేంద్ర ప్రభుత్వం రైతులకు డబ్బులు అందించే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి. ఇదే జరిగితే రైతులకు పండుగ శుభవార్త లభించనట్లే. అయితే మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Show comments