స్మార్ట్ ఫోన్లు వచ్చాక చిన్నా-పెద్ద తేడా లేకుండా అందరూ అదే పనిగా ఫోన్లకు అతుక్కుపోతున్నారు. స్క్రీన్ ను స్క్రోల్ చేస్తూ గంటల కొద్దీ ఫోన్లలోనే గడిపేస్తున్నారు. ఇలా ఫోన్ కు బానిసైపోవడం వల్ల మన ఆయుష్షు తగ్గిపోయే ప్రమాదం ఉందని మీకు తెలుసా??
ఫోన్ తమ జీవనశైలిలో భాగం చేసుకున్నవారు మొత్తం జీవితంలో 34 సంవత్సరాలకు సమానంగా స్క్రీన్ చూస్తూ గడుపుతారని అధ్యయనాలు చెప్తున్నాయి. దీని వల్ల ఫోన్ నుంచి ప్రసరితమయ్యే కాంతి మన కళ్ళపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
బక్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ ఈగలపై ఒక ప్రయోగం చేసింది. దీని ద్వారా జీవుల కన్ను నేరుగానే మన ఆయుర్దాయాన్నినియంత్రించగలదని చెప్తున్నారు పరిశోధకులు. కళ్ళకు హాని కలిగించే కాంతి పరోక్షంగా మనుషుల జీవిగడియారం పై ప్రభావితం చూపిస్తుందని అంటున్నారు. అందుకే రాత్రి సమయంలో కళ్ళకు ఎక్కువ కాంతి తగలడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అందుకే మన పెద్దలు చెప్పినట్లు, ఏ సమయంలో ఏ పని చేయాలో అదే చేయాలి.