సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రశంశించిన “PETA” సంస్థ..

జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి గడిచిన ఏడాది పాలనలో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన పాలనపై ఇటీవలే C.Voter సంస్థ చేసిన సర్వేలో దేశంలోనే అత్యుత్తమ పాలన అందిస్తున్న జాబితాలో 4వ స్థానం సంపాదించుకున్నారు. ఆయన తీసుకువచ్చిన దిశ చట్టం, వాలంటీర్ వ్యవస్థ లాంటి అనేక నిర్ణయాలపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీల నుండి ప్రముఖల వరకు ప్రశంశలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు తాజాగా మూగజీవాల రక్షణ కోసం ఏర్పడ్డ ప్రముఖ సంస్థ PETA తమ ట్విట్టర్ ద్వార సియం జగన్ తీసుకున్న మరో నిర్ణయానికి అభినందనలు తెలియజెసింది.

దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో తీసుకున్న అనేక చర్యలతో కృత్రిమ కాలుష్యం ఏర్పడి సకల జీవరాసులకి ముప్పు ఏర్పడిందనేది కాదనలేని సత్యం. నీరు, భూమి, వాయు కాలుష్యంతో ఇప్పటికే యావత్ ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కుంటుంది. ఈ కాలుష్యం వలన ప్రజలు పడే ఇబ్బంది కన్నా అనేక జీవజాతులు ఎదుర్కుంటున్న సమస్యలే ఎక్కువని చెప్పచ్చు. ఇప్పటికే ఈ కాలుష్యం వలన కొన్ని పక్షి జాతులు సైతం అంతరించిపొయే దశకు చేరుకున్నాయి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పొంచి ఉన్న ప్రమాదంపై పోరాడుతున్న ఇప్పటి వరకు ప్రభుత్వాలనుండి కాని పరిశ్రమల నుండి కాని ఆశించిన ఫలితాలు వచ్చిన దాఖలాలు లేవు. కాలుష్య నివారణకు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు శూన్యం అనే చెప్పాలి.

అయితే ఇప్పుడు తాజాగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం కాలుష్య నివారణ కోసం తీసుకువచ్చిన విధానం సరికొత్త ఆశలు చిగురించేలా చేసి మరికొన్ని రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచింది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోనే మొట్టమొదటి సారిగా కాలుష్యం ద్వారా ఏర్పడే వ్యర్ధాలను ఆన్లైన్ వేస్ట్ ఎక్చేంజ్ ప్లాట్ఫారం ద్వార సేకరించి కో ప్రాససింగ్, రీసైక్లింగ్ చేసే విధంగా చర్యలు చేపట్టారు. దీనికోసం పర్యావరణ అభివృద్ది చట్టం 2020 ని తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ వ్యర్ధాలను ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ ద్వార సేకరించేలా తొలి ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ ని రూపొందించారు. మూఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఈ చర్యలతో కృత్తిమ కాలుష్యం ఏర్పడటానికి తోడ్పాటు అందించే వ్యర్ధాలు పూర్తిగా అదుపులోకి వచ్చి పర్యావరణంతో పాటు మూగజీవాలు సైతం పరిరక్షించబడతాయి అని చెప్పడంలో సందేహం లేదు. దీంతో సీయం జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తు ప్రముఖ జంతు పరిరక్షణ సంస్థ PETA తమ ట్విట్టర్ ఖాతా ద్వార అభినందనలు తెలియజేసింది.

Show comments