iDreamPost
android-app
ios-app

కేసీఆర్ వ్యాఖ్యలను పాజిటివ్ గా తీసుకుంటాం

  • Published Oct 30, 2019 | 9:19 AM Updated Updated Oct 30, 2019 | 9:19 AM
కేసీఆర్ వ్యాఖ్యలను పాజిటివ్ గా తీసుకుంటాం

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం లో ఆర్టీసీ విలీనం పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పాజిటివ్ గా తిసుకుని పని చేస్తామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. బుధవారం అయన విజయవాడలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ విలీనం పై  రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని సందేహిస్తూ.. విలీనం సాధ్యం కాదన్న అర్ధం వచ్చేలా కేసీఆర్ మాట్లాడారు. విలీనమో, లేదో మూడు నెలల్లో తేలుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. కేసీఆర్ ఆలా మాట్లాడడం తో తమలో పట్టుదల, బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.