iDreamPost
android-app
ios-app

నేటి నుండి తాజ్‌ పర్యటనకు సందర్శకులకు అనుమతి

నేటి నుండి తాజ్‌ పర్యటనకు సందర్శకులకు అనుమతి

కరోనా దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో తాజ్‌మహల్‌ సందర్శనను నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుండి సందర్శకులను,పర్యాటకులను తాజ్ వీక్షణకు అనుమతించలేదు. కాగా నేటి నుండి పర్యాటకులను,సందర్శకులను తాజ్ వీక్షణకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

కాగా తాజ్ పర్యటనకు రెండు స్లాట్లుగా మొత్తం 5,000 మందిని అనుమతించనున్నారు.ఒక్కోస్లాటుకు గరిష్టంగా 2,500 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. అంటే రోజుకి 5000 మందికి మాత్రమే తాజ్ పర్యటనకు అనుమతి ఉంటుందని ఏఎస్‌ఐ అధికారులు వెల్లడించారు.కరోనా నేపథ్యంలో మార్చ్ 17 న మూత పడిన తాజ్ మహల్ ఆరు నెలల అనంతరం తెరుచుకోనుండటం గమనార్హం.

తాజ్‌మహల్‌కు పర్యాటకులను అనుమతించనున్న నేపథ్యంలో అధికారులు కోవిడ్ కట్టడి చర్యలు అమలు చేయనున్నారు. ప్రతి పర్యాటకుడి ఉష్ణోగ్రతను పరిశీలించిన అనంతరం మాత్రమే లోపలికి అనుమతించనున్నారు. సందర్శకులకు శానిటైజర్‌ అందుబాటులో ఉంచనున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉంచారు.ఇప్పటి వరకు 160 టికెట్లు బుక్‌ అయ్యాయని, భారత్‌లో ఉంటున్న తైవాన్‌ పర్యాటకుడు మొదటి సందర్శకుడని పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు.