iDreamPost
iDreamPost
కరోనా వైరస్ నియంత్రణలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబునాయుడు ఏడుపు రోజు రోజుకు ఎక్కువైపోతోంది. పైగా ప్రతిరోజూ ఒకే ఏడుపుతో జనాలకు బోరు కొడుతోంది. వైరస్ పై సమీక్షలో ప్రధానమంత్రి నరేంద్రమోడి అందరితో మాట్లాడుతుంటే జగన్ మాత్రం ఎవ్వరినీ కలుపుకుని పోవటం లేదు అని ప్రతిరోజు గుక్కపెట్టి చిన్న పిల్లాడు ఏడ్చినట్లు మరీ ఏడుస్తున్నాడు. ఇక్కడ చంద్రబాబు చిన్న లాజిక్ మరచిపోయాడు. కరోనా వైరస్ నియంత్రణలో కేంద్రం సక్సెస్ అయ్యిందంటే అది రాష్ట్రాల ఘనతే.
ఎందుకంటే రాష్ట్రాల సక్సెస్ మీదే కేంద్రం సక్సెస్ ఆధారపడుందన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయాడు. అలాగే కేంద్రం ఫెయిల్యూర్ రాష్ట్రాల ఖాతాలో పడుతుందన్న విషయాన్ని కూడా ఫార్టి ఇయర్స్ ఇండస్ట్రీ మరచిపోయాడు. కరోనా విషయంలో మోడి రెగ్యులర్ గా ముఖ్యమంత్రులతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే సిఎంల అభిప్రాయాలు, ఆలోచనలను తెలుసుకోవాలి కాబట్టే. ఏ రాష్ట్రంలో అయినా సమస్య తక్కువగా ఉందంటే అక్కడ అవలంభిస్తున్న పద్దతులను తెలుసుకుని అద్యయనం చేయాలి కాబట్టే అందదరితో మోడి మాట్లాడుతున్నాడు.
మరి ఇపుడు ఇంత రెగ్యులర్ గా మాట్లాడుతున్న మోడి పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ఎందుకు మాట్లాడలేదు ? అప్పుడు ప్రజల ప్రాణాలకు నేరుగా సమస్య లేదు. కానీ ఇపుడు ప్రాణాలకే డేంజర్. ఎక్కువమంది చనిపోతే అంతర్జాతీయంగా అది మోడికి అప్రదిష్ట కాబట్టే అందరితో మాట్లాడుతున్నాడు. ఇంత చిన్న విషయాన్ని కూడా చంద్రబాబు ఆలోచించటం లేదంటే ఆశ్చర్యంగా ఉంది.
ఇక జగన్ విషయానికి వస్తే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం రోడ్ల మీదే తిప్పుతున్నాడు. చాలా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపిలో వైరస్ సమస్య నియంత్రణలో ఉన్నట్లే లెక్క. ఢిల్లీలోని మర్కజ్ మసీదు ప్రార్ధనల సమస్య లేకుంటే బాధితుల సంఖ్య చాలా తక్కువగానే ఉండేది. వైరస్ నియంత్రణ విషయంలో తాను బాగా చేస్తున్నాడు కాబట్టే ప్రతిపక్షాలతో మాట్లాడాల్సిన అవసరం లేదని జగన్ అనుకున్నాడేమో ? అసలు వైరస్ బాధితులు పెరిగిపోవటానికి కేంద్ర వైఫల్యమే కారణమని అందరికీ తెలుసు. మరి ఆ విషయంపై మోడికి చంద్రబాబు లేఖ ఎందుకు రాయటం లేదు ?
తాను సిఎంగా ఉన్నపుడు ఏనాడైనా ప్రతిపక్షాలతో ఏ విషయంలో అయినా చంద్రబాబు మాట్లాడాడా ? అసలు రాష్ట్రంలో ప్రతిపక్షాలే అవసరం లేదని చెప్పిన గొప్పోడు చంద్రబాబు. అలాంటిది ఇపుడు మాత్రం ప్రతిరోజు ఎవరితోను మాట్లాడటం లేదని జగన్ పై రోజూ ఏడుస్తుండటమే విచిత్రంగా ఉంది.