iDreamPost
android-app
ios-app

మళ్ళీ రాబోతున్న ఖుషీ – సరైన నిర్ణయమేనా

  • Published Dec 19, 2022 | 3:23 PM Updated Updated Dec 11, 2023 | 1:45 PM

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. రీ మాస్టర్ చేసిన 4కె ప్రింట్ తో ఈ ప్రదర్శన ఉంటుంది. పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ కి తిరుగులేని క్లాస్ అండ్ మాస్ ఫాలోయింగ్ పెరిగింది ఈ ఖుషితోనే.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. రీ మాస్టర్ చేసిన 4కె ప్రింట్ తో ఈ ప్రదర్శన ఉంటుంది. పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ కి తిరుగులేని క్లాస్ అండ్ మాస్ ఫాలోయింగ్ పెరిగింది ఈ ఖుషితోనే.

  • Published Dec 19, 2022 | 3:23 PMUpdated Dec 11, 2023 | 1:45 PM
మళ్ళీ రాబోతున్న ఖుషీ – సరైన నిర్ణయమేనా

రెండు దశాబ్దాల క్రితం రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఖుషి మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. రీ మాస్టర్ చేసిన 4కె ప్రింట్ తో ఈ ప్రదర్శన ఉంటుంది. పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ కి తిరుగులేని క్లాస్ అండ్ మాస్ ఫాలోయింగ్ పెరిగింది ఈ ఖుషితోనే. అప్పట్లో మణిశర్మ స్వరపరిచిన పాటలు ఊరువాడా హోరెత్తిపోయాయి. నెలరోజులకు పైగా హౌస్ ఫుల్ బోర్డులతో హాళ్లు కళకళలడాయి. రజతోత్సవంతో పాటు డబుల్ హండ్రెడ్ డేస్ ఆడిన రికార్డు ఖుషి పేరు మీద ఉంది. క్రేజ్ విషయంలో దీనిది ప్రత్యేక స్థానం

Khushi coming again
అయితే ఈమధ్య రీ రిలీజుల ట్రెండ్ కు జనం నుంచి స్పందన క్రమంగా తగ్గుతోంది. వరసగా వీటిని ప్లాన్ చేయడంతో ఏది చూడాలో అర్థం కానీ అయోమయంలో మూవీ లవర్స్ వీటి మీద ఆసక్తిని తగ్గించుకుంటున్నారు. మొన్న వచ్చిన ప్రేమదేశంకు కొన్ని సెంటర్లు తప్ప అన్ని చోట్ల డిజాస్టర్ రన్ దక్కింది. టాలీవుడ్ గ్రామర్ బుక్ గా చెప్పుకునే మాయాబజార్ పరిస్థితి కూడా ఇంతే. అంతకు ముందు బిల్లా పర్వాలేదనిపిస్తే రెబెల్ కి పరాభవం దక్కింది. చెన్నకేశవరెడ్డికి నిర్మాత చెప్పుకున్న ఫేక్ ఫిగర్లే తప్ప నిజానికి అదీ గొప్పగా పెర్ఫార్మ్ చేయలేదు. కేవలం పోకిరి, జల్సాలు మాత్రమే అంచానాలకే తగ్గట్టు ఆది భారీ వసూళ్లను అందుకున్నాయి

ఇప్పుడు ఖుషి వంతు వచ్చింది. ఇది ఎంత ల్యాండ్ మార్క్ మూవీ అయినప్పటికీ ఇది సరైన సమయం కాదనే చెప్పాలి. ఎందుకంటే కొంచెం గ్యాప్ ఇచ్చి ఉంటే పబ్లిక్ కి మళ్ళీ ఈ రీ రిలీజుల మీద ఆసక్తి పెరిగి చూసేందుకు ఇష్టపడతారు. నిజానికి ఖుషికి ముందు అనుకున్న తేదీ 2023 ఏప్రిల్ 27. కానీ ఈలోగా ఏమైందో కానీ బద్రి స్థానాన్ని మార్చి హఠాత్తుగా రిలీజ్ డేట్ ఇచ్చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా చాలా బిజీగా ఉన్న ఎస్జె సూర్య ఖుషికి దర్శకుడు. పవన్ తోనే హరిహర వీరమల్లు తీస్తున్న ఏఎం రత్నం ప్రొడ్యూసర్. మరి అప్పటి జ్ఞాపకాలను తలపించేలా ఖుషి మళ్ళీ మేజిక్ చేస్తుందో లేదో ఇంకో పది రోజుల్లో తేలిపోతుంది

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss