iDreamPost
android-app
ios-app

Pathaan song Besharam Rang వివాదం రేపుతున్న పఠాన్ పాట

  • Published Dec 13, 2022 | 10:08 PM Updated Updated Dec 13, 2022 | 10:08 PM
  • Published Dec 13, 2022 | 10:08 PMUpdated Dec 13, 2022 | 10:08 PM
Pathaan song Besharam Rang వివాదం రేపుతున్న పఠాన్ పాట

సినిమాకు బజ్ కావాలంటే ఏదో ఒక వివాదం ఉంటే పని సులువవుతుంది. కానీ షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోకి అవసరం లేదు. అయినా వచ్చి పడిందనుకోండి బోనస్సే. జనవరి 25న ఈయన కొత్త మూవీ పఠాన్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. జీరో డిజాస్టర్ తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకుని కింగ్ ఖాన్ నటించిన చిత్రమిది. దీని మీద బోలెడు అంచనాలున్నాయి. టీజర్ గట్రా సాహో టైపు యాక్షన్ ఎంటర్ టైనరనే అభిప్రాయం కలిగించినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు. హృతిక్ రోషన్ టైగర్ శ్రోఫ్ లతో వార్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గా ఆ మాత్రం ఉండటం సహజమే.

తాజాగా ఇందులో బేషరం అనే పాటని రిలీజ్ చేశారు. హీరోయిన్ దీపికా పదుకునే అందాల ఆరబోత మాములుగా లేదు. బికినీ, స్విమ్ సూట్ వేసుకుని ఈ మధ్య కాలంలో ఐటెం సాంగ్స్ కూడా చూడనంత గ్లామర్ షోని ఒక్క వీడియోలోనే చేసి పారేసింది. దీంతో ఆమె వస్త్రధారణ మీద అందులోనూ పవిత్రంగా భావించే కుంకుమపువ్వు రంగుని వాడటం మీద ఒక వర్గం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టింది. తనకన్నా రెట్టింపు వయసున్న వ్యక్తితో ఇంతగా రెచ్చిపోవడం ఏమిటని నెటిజెన్లు సైతం తలంటుతున్నారు. ఒకప్పుడేమో కానీ రణ్వీర్ సింగ్ ని పెళ్లి చేసుకున్నాక శ్రీమతిగా మారిన దీపికా పదుకునే గతంలో కన్నా ఎక్కువ షో ఇస్తోంది.

ఇప్పుడిది పెద్ద రచ్చ అయినా కాకపోయినా పఠాన్ కు కావలసిన మైలేజ్ ఈ సాంగ్ ద్వారా వచ్చేసింది. దీపికా షోకి మిలియన్ల వ్యూస్ వచ్చి పడుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే షారుఖ్ ని సైతం ఫ్రేమ్ లో డామినేట్ చేసేసింది. పఠాన్ బ్లాక్ బస్టర్ కావడం బాద్షాకి చాలా అవసరం. ఇంత గ్యాప్ వచ్చాక కూడా హిట్టు కొట్టకపోతే ఫ్యాన్స్ ఫీలవుతారు. జాన్ అబ్రహం ఇందులో విలన్ గా నటించాడు. ధూమ్, సాహు, వార్ లాంటి యాక్షన్ సినిమాలన్నీ కలిపి మిక్సీ చేసినట్టు అనిపిస్తున్నా అసలు సినిమాలో మ్యాటర్ వేరుగా ఉంటుందని సిద్దార్థ్ తెగ ఊరిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా పఠాన్ విడుదల కానుంది. అన్నట్టు ప్రభాస్ ప్రాజెక్ట్ కెలోనూ దీపికానే హీరోయిన్

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş