iDreamPost
android-app
ios-app

వీడియో: నది మధ్యలో ఆగిన బస్సు.. భయంతో కిటికీల్లోంచి దూకి..!

వీడియో: నది మధ్యలో ఆగిన బస్సు.. భయంతో కిటికీల్లోంచి దూకి..!

ఉత్తర భారత దేశం భారీ వానాల ధాటికి చిగురుటాకులా వణికిపోతుంది. ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యాన,జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో కుంభవృష్టిగా కురిసింది. దీంతో పలు ప్రాంతాలన్ని జలమయంగా మారాయి. అలానే ఈ వరదల ధాటికి వివిధ ప్రాంతాల పదుల సంఖ్యలో జనాలు మృతి చెందారు. కొండ చరియాలు విరిగిపడ్డటం, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో అస్తవ్యస్తంగా మారింది. యుమనా నదితో సహా పలు నదులు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లో ఓ బస్సు నది మధ్యలో చిక్కుపోయింది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో  అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు కుదిపేస్తున్నాయి. ఈ వరద బీభత్సానికి మరణించిన వారి సంఖ్య 37 కి పెరిగింది. అనేక చోట్ల కొండ చరియలు విరిగి పడటం, ఇళ్ళు కూలడం, రోడ్డు ప్రమాదాల వంటి ఘటనల వల్లో ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లింది. రెండు రోజుల వ్యవధిలోనే హిమాచల్ లో 18 మంది మరణించగా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 9 మంది, రాజస్తాన్ లో ఏడుగురు, యూపీలో ముగ్గురు మృతి చెందారు. ఇక ఈ వరదలకు సంబంధించిన దృశ్యాలు అందరి మనస్సున కలిచి వేస్తున్నాయి. కొండపై నుంచి వరద నీరు, బురద నీరు ఊర్లు, పట్టణాల్లోకి ప్రవహించాయి.

ఢిల్లీ లోని యమునా నది ప్రమదర స్థాయిలో ప్రవహిస్తుంది. ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద యుమున నది అత్యంత ప్రమాదక  స్థాయిలో ప్రవహిస్తుంది. యుమున నదితో సహా ఏడు నదులు తీవ్ర రూపం దాల్చి.. ప్రవహిస్తున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో వాహనాలు కొట్టుకుపోతుండగా పలు చోట్ల ఇళ్ళు,ఇతర కట్టడాలు నీటిలో మునిగాయి. ఈ వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్  రాష్ట్రంలోని వికాశ్ నగర్ ప్రాంతంలో ఓ నది మధ్యలో ప్రయాణికులతో వెళ్తున బస్సు చిక్కుకుంది. దీంతో ప్రాణ భయంతో అందులోని ప్రయాణికులు కేకలు వేశారు.

బస్సు కిటీకీల అద్దాల్లోంచి నదిలోకి దూకి అక్కడి నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడే ఉన్న స్థానికులు.. ప్రయాణికులను బయటకు తెచ్చేందుకు సాయం చేశారు. ప్రస్తుతం నదిలో చిక్కుకున్న బస్సు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అక్కడే కొంతమంది ఈ ఘటనలో వీడియో తీయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషులు ప్రమాదంలో ఉంటే ముందు సాయం చేసేది పోయే.. వీడియో ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఉత్తరాదిలో ఈ స్థాయిలో వరదలు రావడానికి కారణాలు ఏమిటి అనేది మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.