Idream media
Idream media
సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడాది దగ్గరపడుతున్నా.. ఓటమి తాలూకూ అసహనం పరిటాల కుటుంబంలో తగ్గడం లేదు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లో ఓడిపోవడంతో వ్యతిరేక వర్గాలపై పరిటాల శ్రీరామ్ పెంచుకున్న కక్ష.. విద్వేషంలా మార్చుకున్నట్లు కనపడుతోంది.
గతంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా వాళ్ల అమ్మ పరిటాల సునీత మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని ఎన్నో దారుణాలకు ఒడిగట్టిన శ్రీరామ్.. ఇప్పుడు కూడా దాని కొనసాగించాలని ఉబలాటపడుతున్నారు. ఇటీవల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో దివంగత వైఎస్సార్ విగ్రహాల మెడకు తాళ్లు కట్టి ఈడ్చికెళ్లామని, మళ్లీ అధికారంలోకి వస్తే విగ్రహాలను ధ్వంసం చేయడమే కాకుండా వైఎస్సార్‌సీపీ నేతల తలలు కూడా పగలకొడతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఫ్యాక్షన్ భూతం ఎందరినో బలితీసుకుంది. పరిటాల శ్రీరామ్ తండ్రి పరిటాల రవికూడా ఫ్యాక్షన్ కు బలయ్యాడు. ఫ్యాక్షన్ ఊబిలో ఎందరో అమాయకులు నేలకొరిగారు. ఇదంతా గతం. ఒక ఉన్నత చదువులు చదివిన వ్యక్తిగా పెద్దల కాలం నుంచి వచ్చిన ఫ్యాక్షన్‌కు వ్యతిరేకంగా కార్యకర్తల్లో మార్పు తీసుకురావాల్సిన శ్రీరామ్.. ప్రస్తుతం ఇంకాస్త ఆజ్యం పోయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఓటమి చెందిన రోజే పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై శ్రీరామ్ అనుచరులు విచక్షణా రహితంగా దాడులు చేశారు. అయితే సంయమనం పాటించిన తోపుదుర్తి.ప్రకాశ్ రెడ్డి . గొడవలు పెద్దవి కాకుండా కార్యకర్తలను శాంతింపజేశారు. ప్రస్తుతం స్థానిక సంస్థల వేళ శ్రీరామ్ మళ్లీ రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీల నుంచి ప్రతి దాడులు మొదలైతే మరోసారి అనంతపురం కాష్టంలా మారుతుంది. బహుశా శ్రీరామ్ కూడా అదే కోరుకుంటున్నట్లు కనపడుతోంది.
దూకుడు వైఖరి కూడా పరిటాల శ్రీరామ్ ఓటమికి ఒక కారణం. పరిటాల సెంటిమెంట్, తొలిసారి వారసుడు పోటీ లాంటి కారణాలేవి శ్రీరామ్‌ను కాపాడలేకపోయాయి. దాదాపు 25వేల పైచిలుకు ఓట్లతో ప్రజలు ఓటమి రుచి చూపించారు. అయినప్పటికీ వాస్తవాన్ని గ్రహించకుండా.. గుడ్డిగా ముందుకు వెళ్లడానికి శ్రీరామ్ ప్రయత్నిస్తున్నారు.
శ్రీరామ్ దూకుడు వైఖరికి వారి తల్లి ,మేనమామాలు కళ్లెంవేయ్యాలి…