iDreamPost
android-app
ios-app

ఈగలున్న చీకటి గదిలో ఇమ్రాన్ ఖాన్.. జీవితాంతం అక్కడే ఉంటానంటూ..

ఈగలున్న చీకటి గదిలో ఇమ్రాన్ ఖాన్.. జీవితాంతం అక్కడే ఉంటానంటూ..

తోషాఖానా కేసులో పాకిస్థాన్  మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఆ కోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం ఆయనకు పోలీసులు అరెస్ట్  చేసి.. అటక్ జైలుకు తరలించారకు. ఆయనకు జైల్లో ప్రత్యేకంగా ఎటువంటి వసతలు కల్పించలేదని తెలుస్తోంది.  స్థానిక మీడియాలు, ఇతర మాద్యమాల ద్వారా వస్తున్న సమాచారం ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ ను చిన్న చీకటి గదిలో  ఇమ్రాన్ ను ఉంచారంట. అందులోనూ చీమలు, ఈగలు ఉన్నట్లు సమాచారం. ఇమ్రాన్ ఖాన్ ఉండే గదిలోనే బాత్ రూమ్  ఉందని, ఎవరినీ కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఇమ్రాన్ అనుచరులు, ఆయన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనకు లోపల ఇలా ఉన్నా.. జైలు బయట మాత్రం భారీ భద్రత కల్పించడం గమనార్హం.

కోర్టు తీర్పును సవాలు చేసే క్రమంలో ఇమ్రాన్ ఖాన్ ను  కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయూమ్ హైదర్ పంతోజీ జైలుకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ తో ఆయన దాదాపు గంట పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా జైల్లో తనకు కల్పిస్తున్న సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని ఇమ్రాన్ చెప్పినట్లు… ఆయన తరపు న్యాయవాది మీడియాతో వెల్లడించారు. న్యాయవాది మాట్లాడుతూ..”ఓ చిన్న చీకటి గదిలో ఉంచారు. టీవీ, వార్తాపత్రిక కూడా లేదు. అందులోనే వాష్ రూమ్ ఉంది. ఈగలు, చీమలు, బెడద ఎక్కువగా ఉంది. నన్నోఉగ్రవాదిగా చూస్తున్నారు. ఎవరినీ కలిసేందుకు అనుమతించడం లేదు. అయినప్పటికీ.. నా మిగతా జీవితం మొత్తం జైల్లోనే ఉండేందుకు సిద్ధం” అని ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లు నయీమ్ హైదర్ తెలిపారు.

మరోవైపు అటక్ జైల్లో ఉన్న తమ అధినేతను అదియాలా జైలుకు మార్చాలని..  అలానే ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరుతూ పీటీఐ పార్టీ సభఅయులు ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంపన్న కుటుంబంలో జన్మించిన ఆయన.. ఉన్నత చదువు, సామాజీకి, రాజకీయ హోదాతో మెరుగైన జీవనం విధానికి అలవాటు పడ్డారని వారు తెలిపారు.  ప్రత్యేక సదుపాయలకు ఆయన ఇమ్రాన్ అర్హుడని పిటిషన్ లో పేర్కొన్నారు. మరి.. ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణలపై  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.