పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాక్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తోషాఖానా అవినీతి కేసులో ఆయనను ఇస్లామాబాద్ లోని జిల్లా సెషన్స్ కోర్టు దోషిగా తెల్చింది. తోషా ఖానా అవినీతి కేసు సంబంధించిన తీర్పును కోర్టు శనివారం వెలువరించింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ ను దోషిగా తేల్చిన కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే ఇమ్రాన్ కి షాక్ అంటే.. మరో గట్టి షాకిచ్చింది.. స్థానిక కోర్టు. ఆయనను ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది.
ఇక మూడేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష పాకిస్థాన్ రూపాయాలను జరిమానా కూడా విధించింది. ఇక ఈ జరిమాన కట్టకని పక్షంలో ఇమ్రాన్ మరో ఆరు నెలల పాటు జైల్లో ఉండాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో వచ్చిన 58 ఖరీదైన బహుమతులను అక్రమంగా అమ్ముకున్నారనన్న ఆరోపణలు వచ్చాయి. అలానే ఈ ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోదై.. ఇంతకాలం విచారణ జరుతూ వచ్చింది. తాజాగా ఈ కేసు సంబంధించి కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసునే తోషాఖానా అవినీతి కేసుగా వ్యవహరిస్తారు. కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది.
దీంతో క్షణాల వ్యవధిలో ఇమ్రాన్ ఖాన్ పోలీసులు అరెస్టు చేశారు. లాహోర్ లోని తన నివాసం ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కోర్టు ఇచ్చిన అనర్హత వేటు తీర్పుతో ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆగష్టు 9న జాతీయ అసెంబ్లినీ రద్దు చేయనున్నట్లు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మూడు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ పై అనర్హత వేటు పడటం చర్యనీయాంశంగా మారింది. మరి.. ఇమ్రాన్ ఖాన్ ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: 70 ఏళ్ల వృద్ధుడితో 23 ఏళ్ల యువతి లవ్వాట! క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్!