iDreamPost
android-app
ios-app

VIDEO: కన్నీళ్లు పెట్టుకుంటూ.. పాక్‌ టీమ్‌పై వీరాభిమాని ఆక్రోశం!

  • Published Oct 17, 2023 | 2:12 PM Updated Updated Oct 17, 2023 | 2:12 PM
  • Published Oct 17, 2023 | 2:12 PMUpdated Oct 17, 2023 | 2:12 PM
VIDEO: కన్నీళ్లు పెట్టుకుంటూ.. పాక్‌ టీమ్‌పై వీరాభిమాని ఆక్రోశం!

వన్డే వరల్డ్‌ కప్‌లో మ్యాచ్‌లు చాలా ఇంట్రస్టింగ్‌గా జరుగుతున్నాయి. కొన్ని ఊహించని షాకులు కూడా తగిలాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌ టీమ్‌.. పసికూన ఆఫ్ఘనిస్థాన్‌ చేతుల్లో ఓడిపోయింది. అలాగే ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి.. పాయింట్స్‌ టేబుల్‌లో చివరి స్థానంలో నిలిచింది. ఇలా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు అంచనాలకు అందకుండా సాగుతున్నాయి. అయితే.. ఓ మ్యాచ్‌ విషయంలో మాత్రం.. సంప్రదాయం, అంచనా మాత్రం లెక్క తప్పకుండా జరిగింది. అదే.. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌.

వన్డే వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఇండియాపై పాకిస్థాన్‌ గెలవలేదు. ఈ వరల్డ్‌ కప్‌ కంటే ముందు మొత్తం 7 సార్లు భారత్‌-పాక్‌ జట్లు తలపడ్డాయి. అన్నింట్లో ఇండియానే విజయం సాధించింది. ఆ తిరుగులేని రికార్డును ఈ వరల్డ్‌ కప్‌లో కూడా నిలబెట్టుకుంది రోహిత్‌ సేన. గత శనివారం.. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టును కేవలం 191 పరుగులకే ఆలౌట్‌ చేసి భారత్‌.. ఆ టార్గెట్‌ను 30.3 ఓవర్లలోనే ఊదిపారేసింది.

ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే క్రికెట్‌ అభిమానుల్లో భారీ ఆసక్తి ఉంటుంది. ఈ రెండు జట్ల మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా చివరి వరకు సాగితే.. ఆ మజాను అంతా ఆస్వాదిస్తారు. కానీ, టీమిండియా దెబ్బకు మ్యాచ్‌ వన్‌సైడ్‌గా మారిపోయింది. ఇండియాతో మ్యాచ్‌ కంటే ముందు.. రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపు మీదున్న పాకిస్థాన్‌పై ఆ దేశ క్రికెట్‌ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో పాకిస్థాన్‌ చెత్త రికార్డును 7-1కి తగ్గిస్తారని ఆశపడ్డారు. కానీ, బాబర్‌ సేన మాత్రం.. టీమిండియా ముందు పసికూనలా ఆడింది. చెత్త ప్రదర్శనతో దారుణంగా ఓడిపోయింది. దీంతో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు చూసేందుకు పాకిస్థాన్‌ నుంచి లక్షలు ఖర్చుపెట్టుకుని ఇండియాకి వచ్చిన ఓ వీరాభిమాని.. పాక్‌ ప్రదర్శనపై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలాంటి ఆడి పాక్‌ పరువుతీసే బదులు ఇంటికి వెళ్లిపోండి అంటూ పాకిస్థాన్‌ టీమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి కిందున్న ఆ వీడియో చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ టైమ్‌లో రోహిత్‌ చేసిన పనితో సీన్‌ మొత్తం మారిపోయింది: కుల్డీప్‌ యాదవ్‌