iDreamPost
android-app
ios-app

భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు.. మధ్యలో తెలివి వచ్చి చూసే సరికి..!

భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు.. మధ్యలో తెలివి వచ్చి చూసే సరికి..!

ప్రస్తుతం సమాజంలో బంధాలు బాగా పలుచన అవుతున్నాయి. ఎంతోమంది కట్టుకున్న వారితో కంటే బయట వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంతో మంది అక్రమం సంబంధాల మోజులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. 5 నిమిషాల చీకటి సుఖం కోసం పవిత్రమైన పెళ్లి బంధాన్ని అవహేళన చేస్తున్నారు. కొందరైతే కట్టుకున్న వారిని కడతేర్చేందుకు కూడా వెనుకాడటం లేదు. అలాంటి కోవకు చెందిన ఒక మహిళ గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.

విజయనగరం కుమ్మరివీధిలో ఈ ఘటన వెలుగు చూసింది. కోటరాజు- శ్రీదేవి దంపతులు స్థానికంగా నివాసముంటున్నారు. శ్రీదేవికి భర్తతో కాకుండా మరో వ్యక్తితో సంబంధం ఉంది. ఏమనుకుందో ఏమో.. భర్త అడ్డు తొలగించుకోవాలని భావించింది. ప్రియుడి సాయంతో అతడిని హతమార్చేందుకు ప్రణాళిక రచించింది. గంధవరపు రఘు ప్లాన్ ప్రకారం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరి నుంచి శ్రీదేవికి నిద్రమాత్రలు తీసుకొచ్చి ఇచ్చాడు. వాటిని మటన్ బిర్యానీలో కలిపి భర్తకు తినిపించింది.

భర్త, పిల్లలు నిద్రలోకి జారుకున్నారు. రఘు ఒక్కడే కాకుండా దగ్గరి బంధువు అయిన కేత శ్రీనును రూ.20 వేలకు మాట్లాడుకున్నారు. రఘు, శ్రీను ఇద్దరూ శ్రీదేవి ఇంటికి వెళ్లారు. నిద్రపోతున్న కోటరాజు మెడకు నైలాన్ దారం బింగించి చంపేందుకు ప్రయత్నించారు. మధ్యలో మెలుకువ రావడంతో కోటరాజు కేకలు వేశాడు. భయంతో రఘు, శ్రీను పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీదేవి, రఘు, శ్రీనులను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు ముగ్గురు నేరం అంగీకరించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş