iDreamPost
android-app
ios-app

అపార్టుమెంట్ లో లేడీ రియల్టర్ దారుణ హత్య.. మెడకి చున్నీ బిగించి..!

అపార్టుమెంట్ లో లేడీ రియల్టర్ దారుణ హత్య.. మెడకి చున్నీ బిగించి..!

రియల్ ఎస్టేట్ వ్యాపారం, పెట్టుబడి మార్గం, లాభాల బాట పట్టించే వనరుగా మారి చాలా ఏళ్లు అయింది. ఎంతోమంది రియల్ ఎస్టేట్ ను ఒక వ్యాపారంలా చేస్తున్నారు. అయితే ఈ రియల్ ఎస్టేట్ లో లాభాలే కాదు.. ప్రాణాలకు ప్రమాదం కూడా ఉంటుందని మరోసారి రుజువైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక వివాహిత ప్రాణాలు బలిగొంది. దారుణంగా హత్యకు గురయ్యేలా చేసింది. నమ్మిన వ్యక్తే ఆమె ప్రాణాలు తీశాడంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ దారుణ హత్య కరీంనగర్ లో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరి ఖనికి చెందిన సరిత(35) 2001లో మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన గుండా శ్రీపాల్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. గోదావరిఖనిలో సరిత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటుంది. అయితే ఆమె అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం నచ్చని శ్రీపాల్ రెడ్డి ఆమెకు అభ్యంతరం చెప్పాడు. ఆ విషయంలో వారి మధ్య గొడవలు కూడా జరిగేవి. ఏడాదిగా ఇద్దరూ దూరంగా ఉంటున్నారు.

వ్యాపారం మీద సరిత అప్పుడప్పుడూ కరీంనగర్ వెళ్తుండేది. సరిత తమ్ముడు సతీశ్ కూడా నగరంలోని రాంనగర్ లో ఉంటూ ఉంటాడు. వేసవి సెలవులు కావడంతో సరిత పిల్లలతో సహా తమ్ముడి ఇంట్లోని ఉంది. అలాగే సరితకు వెంకటేశ్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. వెంకటేశ్ భరత్ నగర్ లోని క్రిస్టల్ అపార్టుమెంట్ 203 ఫ్లాట్ లో నివాసం ఉంటుంటాడు. జూన్ 28న పిల్లలను గోదావరిఖని పంపేసిన సరిత.. వెంకటేశ్ తో కలిసి వ్యాపారం విషయమై వరంగల్ వెళ్తున్నాని చెప్పింది.

తర్వాత రోజు సతీశ్ ఫోన చేయగా.. ఆమె ఫోన్ స్విచ్చావ్ అని వచ్చింది. అక్కకు ఏమైంది అనే విషయం తెలియక సతీశ్ కంగారు పడ్డాడు. అయితే శుక్రవారం సరిత ఫోన్ నుంచి వెంకటేశ్ ఆమె సోదరుడిక వాట్సాప్ కాల్ చేశాడు. సరిత అపార్టుమెంటులోనే ఉందని.. ఆమె ప్రమాదశాత్తు గోడకు గుద్దుకుని రక్తస్రావం జరిగిందని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సతీశ్ హుటాహుటిన అపార్టుమెంట్ కు వెళ్లి తాళం పగలగొట్టి లోపలకి వెళ్లాడు. తలకు గాయం, ముఖం మొత్తం రక్తంతో సరిత పడి ఉంది. ఆమె మెడకు చున్నీ చుట్టి ఉంది.

సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో అపార్టుమెంట్ కు చేరుకుని ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే నగదు లావాదేవీల విషయంలోనే వెంకటేశ్- సరితను హత్య చేశాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెట్టుబడి నిమిత్తం వెంకటేశ్ కు ఇచ్చిన రూ.25 లక్షలు తిరిగి ఇమ్మన్నందుకే ఈ హత్య చేసినట్లు చెబుతున్నారు. పరారీలో ఉన్న వెంకటేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.