iDreamPost
android-app
ios-app

ఈ EV స్కూటర్ కొంటే ఫ్రీగా థాయ్ లాండ్.. క్యాష్ బ్యాక్ ఆఫర్స్!

ఈ EV స్కూటర్ కొంటే ఫ్రీగా థాయ్ లాండ్.. క్యాష్ బ్యాక్ ఆఫర్స్!

ఎలక్ట్రిక్ బైక్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఈవీ తయారీలోకి ఎన్నో కొత్త కంపెనీలు అడుగుపెట్టాయి. కానీ, ఇటీవల కేంద్రం సబ్సిడీ తగ్గించడంతో ఈవీల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కంపెనీలు తప్పక రేట్లను పెంచాయి. అయితే ఈవీలు ప్రియం కావడంతో కస్టమర్స్ వాటి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పడిపోయిన అమ్మకాలను నిలబెట్టేందుకు ఒక కంపెనీ వినూత్న ఆఫర్స్ ని అమలు చేస్తోంది. ఫ్రీగా థాయ్ లాండ్ కూడా తీసుకెళ్తామంటూ చెబుతోంది.

మీరు ఈవీ కొనాలి అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి సమయంగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రముఖ ఈవీ స్కూటర్ తయారీ కంపెనీ ఒకాయా అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. ఒకాయాకు చెందిన ఎన్నో మోడల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఒకాయా మోడల్స్ పై రూ.5 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. ఈ కంపెనీలో ఫాస్ట్ ఎఫ్ 1బీ, ఫాస్ట్ ఎఫ్ 2టీ మోడల్స్ పై ఈ ఆఫర్స్ ఉన్నాయి. వీటి ధర డిస్కౌంట్ తర్వాత రూ.లక్షకు లోపే ఉండటం విశేషం.

అంతేకాకుండా గ్యారెంటీ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తోంది. ఒకయా రెండో వార్షికోత్సవం సందర్భంగా ఇలాంటి అదిరే ఆఫర్స్ ని తీసుకొచ్చింది. ముఖ్యంగా వీరి బైక్ కొంటే మీకు థాయ్ లాండ్ వెళ్లే అవకాశాన్ని అందిస్తోంది. ఈ బైక్ కొనుగోలు చేసిన తర్వాత మీర లక్కీ డ్రాలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ లక్కీ డ్రాలో ఎంపికైన ఒకరికి థాయ్ లాండ్ వెళ్లే అవకాశం లభిస్తుంది. కేవలం ఒక్కరికి మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుంది. ఈ ట్రిప్ ధర రూ.50 వేలు వరకు ఉంటుంది.

లక్కీ డిప్ లో పాల్గొనాలి అనుకోకపోతే.. మీకు అదనంగా రూ.5 వేలు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్స్ అన్నీ లిమిటెడ్ పిరియడ్ కే అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్టాక్ అయిపోయేంత వరకు మాత్రమే ఈ ఆఫర్స్ లభిస్తాయి. స్కూటర్ కొనుగోలు చేస్తే.. రూ.2 వేలు, రూ.5 వేలు, రూ.1500, రూ.1000, రూ.500 ఇలా క్యాష్ బ్యాక్ అందిస్తున్నారు. దీనిని పొందేందుకు.. బండి కొనుగోలు చేసిన తర్వాత డీలర్ల నుంచి డిజిటల్ స్క్రాచ్ కార్డ్ లభిస్తుంది. దానిలో మీకు కచ్చితమైన క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetboo girişgrandpashabet